English | Telugu

హైప‌ర్ ఆది పెళ్లి సీక్రెట్ చెప్పేశాడు

జ‌బ‌ర్ద‌స్త్ వేదిక‌పై హైప‌ర్ ఆది చేసే హంగామా అంతా ఇంతా కాదు. రాకెట్ స్పీడుతో పంచ్ లు వేస్తూ న‌వ్వులు కురిపించ‌డం హైప‌ర్ ఆది ప్ర‌త్యేక‌త‌. సుడిగాలి సుధీర్‌, ఆటో రాంప్ర‌సాద్‌, గెట‌ప్ శ్రీ‌నుతో క‌లిసి హైప‌ర్ ఆది చేసే స్కిట్స్ ఓ రేంజ్ లో పేలుతుంటాయి. ఇప్ప‌టికే జ‌బ‌ర్ద‌స్త్ ద్వారా పాపుల‌ర్ అయిన హైప‌ర్ ఆది ప్ర‌స్తుతం వ‌రుస షోల‌తో బిజీగా వున్నాడు. శ్రీ‌దేవి డ్రామా కంపెనీ, ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్ షోల‌తో ఆక‌ట్టుకుంటున్న హైప‌ర్ ఆది తాజాగా న్యూ ఇయ‌ర్ కోసం ఓ షోలో పాల్గొన్నాడు.

ఈ షోకి వివాదాస్ప‌ద చిత్రాల ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ హాజ‌రై త‌నదైన స్టైల్ పంచ్ ల‌తో ఆక‌ట్టుకున్నారు. ఇదే వేదిక‌పై హైప‌ర్ ఆది ఫ్యామిలీ మెంబ‌ర్స్ కూడా ఎంట్రీ ఇచ్చారు. ఆదివాళ్ల నాన్న‌తో పాటు అత‌ని ఇద్ద‌రు సోద‌రులు కూడా ఈ షోలో పాల్గోన్నారు. ఈ సంద‌ర్భంగా త‌న తండ్రి రోజూటిప్ టాప్ గా రెడీ అయిపోయి బ్రాందీషాప్ ద‌గ్గ‌రికి వెళతాడ‌ని, 'నువ్వెందుకు వెళ్ల‌డం నాన్న నేను తీసుకొస్తాను క‌దా' అంటే 'అక్క‌డ క్యూలో 50 మంది వుంటారు.. నేను రాగానే హైప‌ర్ ఆది ఫాద‌ర్ వ‌చ్చాడంటూ న‌న్నే ముందు నించోబెడ‌తార‌ని అందుకోస‌మే బ్రాందీషాప్ కి వెళతాన‌'ని అంటాడ‌ని చెప్పుకొచ్చాడు.

Also Read:కాజ‌ల్ ప్రెగ్నెన్సీని క‌న్ఫామ్ చేసిన గౌత‌మ్‌!

దీంతో వ‌ర్మ తో స‌హా అక్క‌డున్న వారంతా గొల్లున న‌వ్వేశారు.త‌న ఫ్యామిలీ గురించి చెబుతూ హైప‌ర్ ఆది ఎమోష‌న‌ల్ అయ్యాడు. ఆ త‌రువాత ఆది మా కుటుంబానికి దేవుడ‌ని, వాడు లేక‌పోతే మేము లేమ‌ని ఆది తండ్రి కూడా ఎమోష‌న‌ల్ కావ‌డం అక్క‌డున్న వారిని కూడా భావోద్వేగానికి లోన‌య్యేలా చేసింది. ఇదే సంద‌ర్భంగా ఇంద్ర‌జ ... ఆది పెళ్లెప్పుడ‌ని అత‌ని తండ్రిని అడిగేసింది. ఫ్లోలో వున్న ఆది ఫాద‌ర్ ...ఒంగోలులో ఓ అమ్మాయిని చూస్తే వ‌ద్ద‌న్నాడ‌ని, ఇంకా రెండేళ్ల టైమ్ కావాల‌న్నాడ‌ని అస‌లు సీక్రెట్ బ‌య‌ట‌పెట్టేశాడు. దీంతో ఈ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.