English | Telugu

రిషిని భోజనం చేయకుండా అడ్డుపడిన దేవయాని

దేవయాని మాటలకు జగతి, మహేంద్ర బాధపడుతూ ఉంటారు. జగతి బాధను చూడలేక మహేంద్ర ఆమెకు ధైర్యం చెప్తాడు. దేవయాని అక్క తన నుంచి రిషిని మరింత దూరం చేయడానికి ట్రై చేస్తోందని తెలిసి బాధపడుతుంది. 'నేను చిన్నప్పుడు విడిచి వెళ్ళిపోయాను, సాక్షి మధ్యలో వెళ్ళిపోయింది, వసు లవ్ చేయట్లేదని చెప్పింది. చివరికి దేవయాని అక్కయ్య ఇలా అబద్దపు ప్రేమ చూపిస్తుంటే రిషి ఏమవుతాడు' అని జగతి చాలా ఫీలవుతూ ఉంటుంది.

ఇంకో వైపు వసు సైకిల్ కి పంక్చర్ అయ్యేసరికి దిగులుగా ఉంటుంది. అదే టైంకి అటుగా వెళ్తున్న రిషి.. వసుని చూసి ఫన్నీగా మాట్లాడతాడు. 'నేను నీ సైకిల్ రిపేర్ చేయనా' అని అడుగుతాడు. 'మీ వల్ల కాదు అంటుంది' వసుధార. సైకిల్ బాగుచేసుకుంటున్నప్పుడు ముఖానికి ఆయిల్ మరక అవుతుంది. కర్చీఫ్ ఇస్తాడు రిషి. వసు తీసుకోదు. తర్వాత ఇద్దరూ కలిసి క్యారెక్టర్స్ ని మార్చుకుని మాట్లాడుకుంటారు సరదాగా. అప్పుడు ఇద్దరూ కలిసి టీ తాగి కారులో వెళ్ళిపోతారు.

ఇంటికి వెళ్లిన రిషికి మహేంద్ర ఎదురౌతాడు. 'భోజనం చేశారా డాడ్?' అని అడుగుతాడు రిషి. 'నీకోసమే చూస్తున్నా' అంటాడు మహేంద్ర. ఆ తర్వాత జగతి ఫుడ్ రెడీ చేస్తూ ఉంటుంది. దేవయాని వచ్చి 'నువ్వు రిషికి భోజనం వడ్డించొద్దు' అని చెప్పి త‌ను వడ్డిస్తుంది. రిషి భోజనం చేసి వంటలు చాలా బాగున్నాయని అనేసరికి దేవయాని కల్పించుకుని 'నేనే చేసాను' అంటుంది. ఎవరు చేశారని చెప్తే ఏముందిలే నా కొడుకు కడుపునిండా తింటే చాలు అనుకుంటుంది జగతి.

రిషి భోజనం చేస్తున్నప్పుడు సాక్షి టాపిక్ తెస్తుంది దేవయాని. వెంటనే సీరియస్ గా భోజనం చేయకుండా మధ్యలో లేచి వెళ్ళిపోతాడు రిషి. అది చూసి జగతి బాధపడుతుంది. మిగతా ఎపిసోడ్ హైలైట్స్ కోసం సాయంత్రం స్టార్ మాలో ప్రసారమయ్యే 'గుప్పెడంత మ‌న‌సు' సీరియల్ చూడాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.