English | Telugu

Karthika Deepam2 : తల్లి దగ్గర జ్యోత్స్న కపటనాటకం.. తన ప్రాణధాత దీపే అని తెలుసుకున్న కార్తీక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -293 లో.... దశరథ్ అన్న మాటలు జ్యోత్స్న గుర్తుచేసుకుంటుంది. ఆ దాస్ ఎప్పుడైనా నిజం చెప్పేలా ఉన్నాడు.. ఇన్ని రోజులు చెప్పకుండా ఆపాగలిగానంటే అది నా లక్.. నిజం తెలిసేలోపు ఎలాగైనా దీపని చంపెయ్యాలని జ్యోత్స్న అనుకొని ఒకతనికి ఫోన్ చేసి మాట్లాడుతుంది. నేను చెప్పిన దగ్గరికి రా అంటూ మాట్లాడుతుంది. దీప ఇలా చెయ్యక తప్పడం లేదంటూ తనలో తను మాట్లాడుకుంటుంది. దీప కుబేర్ ఫోటో దగ్గర దీపం పెడుతుంది. ఆ దీపం ఆరిపోవడం తో దీప బాధపడుతుంటుంది. అది చూసిన కార్తీక్.. గాలికి పోయిందని సర్దిచెప్తాడు. దాంతో దీప మళ్ళీ దీపం పెడుతుంది.

జ్యోత్స్న దగ్గరికి పారిజాతం వెళ్లి లేపుతుంది. నాకు తలనొప్పిగా ఉందని పంపిస్తుంది. దాంతో పారిజాతం వెళ్తుంటుంది. అప్పుడే తనకి సుమిత్ర ఎదరుపడుతుంది. జ్యోత్స్న కి తలనొప్పిగా ఉందట అని చెప్తుంది. దాంతో జ్యోత్స్న దగ్గరికి సుమిత్ర వెళ్తుంది. మమ్మీ మిమ్మల్ని చాలా బాధపెడుతున్న సారీ అంటూ జ్యోత్స్న చెప్తుంది. మనం తర్వాత మాట్లాడుకుందామని సుమిత్ర అనగానే.. పడుకుంటున్నా గ్రానిని రానివ్వకని జ్యోత్స్న అంటుంది. నా గదిలో పడుకో ఎవరు డిస్టబ్ చెయ్యరని జ్యోత్స్నని తన గదిలోకి తీసుకొని వెళ్లి పడుకొపెడుతుంది. నా కూతురిలో మార్పు మొదలు అయిందని సుమిత్ర హ్యాపీగా ఫీల్ అవుతుంది. నేను ఇలా కొన్ని రోజులు నమ్మించాలి మమ్మీ అని జ్యోత్స్న అనుకొని బెడ్ పై ఫిల్లో స్ పెట్టి తను పడుకున్నట్లు సెటిల్ చేసి గోడ దూకి బయటకు వెళ్తుంది జ్యోత్స్న.

మరొకవైపు కార్తీక్ ఏదో పేపర్స్ చూస్తుంటే.. కింద దీప చిన్నప్పటి కనపడుతుంది. ఈ అమ్మాయి నా ప్రాణధాత కదా.. నాకు ఇంకా గుర్తుందంటూ కార్తీక్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఈ ఫోటో ఎవరు తీసుకొని వచ్చారంటూ అనసూయ దగ్గరకు వెళ్లి.. ఈ ఫోటో ఎవరిదని అడుగుతాడు. 'ఈ ఫోటో దీపది.. మొన్న శౌర్య నీకు చూపిస్తానన్న ఫోటో ఇదే' అని అనసూయ చెప్తుంది. దీప నా ప్రాణధాత అంటూ కార్తీక్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. దీపకి గుర్తు లేదా గుర్తు ఉంటుంది కానీ బయటపడడం లేదు.. మొన్న నేను గొప్ప స్థాయికి వెళ్లాక ఒక విషయం చెప్తానంది. అది ఇదేనేమో అని కార్తీక్ అనుకుంటాడు. ఇప్పుడు దీపతో మాట్లాడాలని కార్తీక్ అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.