English | Telugu

Brahmamudi : కీలక ఆధారం కనిపెట్టిన అప్పు.. రాజ్ ని కావ్య బయటకు తీసుకొస్తుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -655 లో అందరు కావ్యని నిందిస్తుంటే తన భర్త జైల్లోకి వెళ్తే ఒంటరిగా ఉండేది తనే రాజ్ ని ఎలా కాపాడుకోవాలని కావ్య ఒక యుద్ధమే చేస్తుంది. ఎందుకు అందరు తనని అర్థం చేసుకోవడం లేదని ఇందిరాదేవి అనగానే కావ్యని అపర్ణ హగ్ చేసుకుంటుంది. నేను కూడా నిన్ను అర్ధం చేసుకోలేకపోయానని అపర్ణ ఎమోషనల్ అవుతుంది.

ఒకవైపు కావ్య, మరొకవైపు అప్పు లు రాజ్ ని ఎలా బయటకు తీసుకొని రావాలని ఆలోచిస్తుంటారు. అప్పుడే అప్పుకి ఏదో మెసేజ్ వస్తుంది. వెంటనే కావ్య దగ్గరికి వెళ్లి సామంత్ ని చంపడానికి ఉపయోగించిన ఆయుధం ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపిస్తే ఎవరు చంపారో తెలుస్తుందని అప్పు అంటుంది. మరొకవైపు రుద్రాణి, అనామిక లు ఫోన్ మాట్లాడుకుంటారు. నువ్వు చాలా గ్రేట్ అనామిక, అనుకున్నది చేసావ్ కానీ నీ పగ కోసం నీకు కాబోయే భర్తని త్యాగం చేసావని రుద్రాణి అనగానే కనిపెట్టేశారా అని అనామిక అంటుంది. మరుసటి రోజు కావ్య, అప్పులు రాజ్ ఆ రోజు రాత్రి వెళ్ళిన ఆఫీస్ కి వెళ్లి అక్కడ సెక్యూరిటీ గార్డ్ తో మాట్లాడతారు..... అతను రౌడీలు వచ్చి ఎటాక్ చేస్తుంటే రాజ్ కి ఫోన్ చేసిన విషయం చెప్తాడు. కాని స్టేబుల్స్ చుట్టుపక్కల అంతా వెతుకుతుంటారు. అక్కడ ఒక రాడ్ దొరుకుతుంది. దానికి బ్లడ్ ఉంటుంది. అది అప్పు చూసి ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపిస్తుంది.

మరోవైపు ఇంట్లో ఉన్న అపర్ణ బాధపడుతూ తిండి తిప్పలు లేకుండా ఏడుస్తుంటుంది. అప్పుడే ఇందిరాదేవి అపర్ణకి జ్యూస్ తీసుకొని వస్తుంది. వద్దని అపర్ణ అంటుంది. అప్పు, కావ్యలు వస్తారు. రాజ్ బావ ని బయటకు తీసుకొని వచ్చే ఆధారం ఒకటి దొరికింది. అది ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించాం.. ఆ రిపోర్ట్ లో ఎవరు హత్య చేసారో తెలుస్తుందని అప్పు అనగానే అపర్ణ సంతోషపడి జ్యూస్ తాగుతుంది. స్టేషన్ కి కావ్య భోజనం తీసుకొని వెళ్లి రాజ్ కి తినిపిస్తుంది. చాలా కష్టసమయాల్లో నన్ను ప్రాబ్లమ్ నుండి బయటకు పడేసావ్ ఇప్పుడు కూడా నువ్వు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తావని అనుకుంటున్నానని కావ్యతో రాజ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.