English | Telugu

Eto Vellipoindi Manasu : సీతాకాంత్ దగ్గరికి రమ్య.. ఆమె కోసం సవతి తల్లి ప్లాన్!

Eto Vellipoindi Manasu : సీతాకాంత్ దగ్గరికి రమ్య.. ఆమె కోసం సవతి తల్లి ప్లాన్!

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్ళిపోయింది మనసు' (Eto Vellipoindi Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-352 లో.. రామ్ ని తిట్టి పంపించేస్తుంది రామలక్ష్మి. దాంతో ఇక రామ్ చదువుకోనంటూ వెళ్తుంటే సీతాకాంత్ అడ్డుపడి.. మేడమ్ నిన్ను అనలేదని అంటాడు. ఆ తర్వాత రామ్ కి సీతాకాంత్ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. అదే సమయంలో ఫణీంద్ర, సుశీలలు ఇద్దరు కలిసి రామలక్ష్మితో మాట్లాడతారు. నువ్వు రామలక్ష్మివి కాదని చెప్తూనే నువ్వు బయటపడుతున్నావ్.. నా మనవరాలు మైథిలి అయితే ఒక ప్రిన్సిపల్ గా ఉండేది కానీ నువ్వు రామ్, సీతాకాంత్ లని మైథిలి స్థానంలో ఉండి చూడలేదని చెప్తారు.

 

ఇక సీతాకాంత్ దగ్గరికి రామలక్ష్మి వచ్చి మాట్లాడాలని చెప్తుంది. చెప్పు రామలక్ష్మి సారీ మైథిలి అని సీతాకాంత్ అనగానే.. మీరు పదే పదే అదే పేరుతో పిలిచి నన్ను డిస్టబ్ చేస్తున్నారు. మీ వల్ల నా ఫీలింగ్స్ అన్నీ కంట్రోల్ చేసుకొని బ్రతుకుతున్న.. ఎందుకంటే ఎక్కడ కనపడితే నువ్వు రామలక్ష్మి అని అంటావో అని సీతాకాంత్ తో కోపంగా మైథిలి అంటుంది‌‌. దాంతో సీతాకాంత్ కి ఏంఅర్థం కాదు. ఇంకోసారి నా జోలికి రావద్దని మైథిలి చెప్పగానే.. తనని నేను ఇబ్బంది పెడుతున్నానా.. తను రామలక్ష్మి కాదా అని సీతాకాంత్ అనుకుంటాడు. 

 

మరోవైపు శ్రీలత, శ్రీవల్లి మెట్లు దిగి వస్తుంటే అప్పుడే రమ్య ఎంట్రీ ఇస్తుంది. గిఫ్ట్ బ్యాగ్స్ మోసుకొచ్చిన రమ్య.. సీతాకాంత్, రామ్ లని పిలుస్తుంది. అప్పుడు సీతాకాంత్, రామ్ ఇద్దరు వస్తుంటారు‌. వారిని చూసిన రమ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక తనకి ప్రమోషన్ వచ్చిందంటూ రమ్య చెప్పగానే సీతాకాంత్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. శ్రీలత, శ్రీవల్లిలు రమ్యని చూసి మనసులో తిట్టుకుంటారు. ఇక రమ్యని తమ ఇంట్లోనే సీతాకాంత్ ఉండమనడంతో శ్రీలత వాళ్ళు డిజప్పాయింట్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.