English | Telugu

Illu Illalu Pillalu: వేదవతిని ఇరకాటంలో పెట్టిన రామరాజు.. నిజం చెప్పేస్తుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu Illalu Pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-106లో.. ప్రేమ వెయిటర్ గా పనిచేయడం చూసిన భద్రవతి ఫ్యామిలీ భాదపడతారు. మార్చేశారు అక్కా.. నా కూతుర్ని మొత్తం మార్చేశారు.. ఆ రామరాజుగాడి మాయమాటలతో ప్రేమను మార్చేశారు. ఇన్నాళ్లూ పెంచిన మనం..ఇప్పుడు శత్రువులు అయిపోయామని సేనావతి కన్నీళ్లు పెట్టుకుంటాడు. అవునండీ.. మన బాధ మన కూతురికి అర్థం కావడం లేదు. మహారాణిలా పుట్టి పెరిగిన నా కూతురుకి ఎంగిలి కంచాలు ఎత్తే దుస్థితి పట్టిందని ప్రేమ తల్లి భోరున ఏడుస్తుంది.

ఏది ఏమైనా ప్రేమను మన ఇంటికి మనం తెచ్చేసుకోవాలి అక్కా.. లేదంటే మన బిడ్డని కష్టపెట్టడమే కాదు.. మనకి శాశ్వతంగా దూరం చేస్తాడని సేనాపతి అంటాడు. అంత వరకు రాకుండా ఏదోటి చేయాలిరా అని భద్రవతి అనగానే అవును అత్తా ఇన్నాళ్లూ మనం ఆ ధీరజ్ గాడి వైపు నుంచి నరుక్కుంటూ వచ్చాం కానీ ఇప్పుడు మనం చేయాల్సింది.. ప్రేమ వైపు నుంచి నరుక్కుంటూ రావాలి. రేపటి నుంచి అదే పనిలో ఉంటాను. ఏం చేసైనా సరే.. ప్రేమను మన ఇంటికి తీసుకొస్తాను ఈసారి మన ప్లాన్ మిస్ కాదని విశ్వ అంటాడు.

మరోవైపు వేదవతి ఆలోచిస్తుంటుంది. దీనంతటికీ కారణం నేనే.. వెళ్లి ఆయనకి నిజం చెప్పేస్తానంటూ రామరాజు దగ్గరకు వెళ్తుంది. ఈ విషయాన్ని ఇంకా దాచిపెడితే ధీరజ్‌కి వాళ్ల నాన్నకి మధ్య ఇంకా దూరం పెరుగుతుంది. అందుకే ఆయన నన్ను ఏమనుకున్నా పర్లేదు.. జరిగింది ఆయనతో చెప్పేస్తానని ఆవేశంగా వెళ్తుంది. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత రామరాజు తుస్సుమనిపిస్తాడు.

రామరాజుకి నిజం చెప్పడానికి వెళ్తే.. రామరాజే తిరిగి ప్రశ్నిస్తాడు. ఎందుకిలా చేశావ్.. నిజంగా నీకు ధీరజ్, ప్రేమల పెళ్లి గురించి తెలియదా? తెలిసి కూడా నాకు చెప్పకుండా మోసం చేస్తున్నావా? నాకు వాళ్ల పెళ్లిపై చాలా అనుమానాలు ఉన్నాయి? వాడు అసలు ప్రేమని ప్రేమించాడా? ప్రేమించి ఉంటే వాళ్ల అన్నయ్యలతో చెప్పేవాడు. వాడు కనీసం నీకైనా చెప్తాడు. వాడు నీకు చెప్పలేదంటే ఏదో జరిగి ఉంటుంది‌‌. అన్నింటికంటే ముఖ్యంగా.. మిమ్మల్ని గుడికి పంపినరోజే వాడు పెళ్లి చేసుకుని వచ్చాడంటే అదే రోజు ఏదో జరిగింది. మన ఇంట్లో జరిగే గొడవలన్నింటికీ ఆ పెళ్లే కారణం. ఆ కారణమే వాడిపై ఉన్న ప్రేమ.. ద్వేషంగా మారింది. వాడ్ని జన్మలో క్షమించలేను. నిన్ను ఈ విషయం గురించి అడిగి బాధపెట్టి ఉంటే క్షమించు బుజ్జమ్మా.. నీకు ఏదైనా తెలిస్తే ముందు నాకే చెప్తావ్.. నువ్వు చెప్పలేదంటే నీకు తెలియదనే అర్థం. నన్ను ఎవ్వరు మోసం చేసినా నా బుజ్జమ్మ నన్ను మోసం చేయదనే నమ్మకం ఉందని.. బుజ్జమ్మ నోరు నొక్కేసేట్టుగా రామరాజు మాట్లాడతాడు. ఇంకేముంది.. చెప్పేస్తా.. చెప్పేస్తా అంటు వెళ్లిన బుజ్జమ్మ ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.