English | Telugu

భార్యకి మనసులో‌ మాట చెప్పగలడా.. ఆస్తుల కోసం అంతకు తెగించాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -194 లో..... ఫోటో షూట్ కి నందిని పంపిన సూట్ ని సీతాకాంత్ వేసుకొని రావడంతో తను చాల హ్యాపీగా ఫీల్ అవుతుంది. చూసావా ఇప్పటికైనా నా ప్రేమని నమ్ముతావా అని హారికతో అంటుంది.ఆ తర్వాత రామలక్ష్మి పెద్దాయన మాట్లాడుకుంటుంటే.. అప్పుడే మేనేజర్ వచ్చి అందరికి స్వీట్ ఇస్తుంటాడు. ఏంటి స్పెషల్ అని రామలక్ష్మి అడుగుతుంది. నందిని మేడం కి స్పెషల్ డే అంట అందుకే స్వీట్ ఇవ్వమన్నారని చెప్తాడు.

ఆ తర్వాత నందిని హారికకి స్వీట్ ఇస్తూ.. ఎప్పుడు నువ్వు నా మంచి కోరుకుంటావ్.. అందుకే నా హ్యాపీ నెస్ ని నేను షేర్ చేసుకుంటున్నానని నందిని అంటుంది. ఇప్పుడు వెళ్లి సీతతో షేర్ చేసుకుంటామని నందిని స్వీట్ తీసుకొని వెళ్లి సీతాకాంత్ కి ఇస్తుంది. ఏంటి ఇప్పుడు స్వీట్ అనుకుంటున్నావా నాకు ఈ రోజు చాలా హ్యాపీగా ఉందని నందిని అంటుంది. నీ ఆనందంనికి కారణమని సీతా అడుగుతాడు. దానికి కారణం నువ్వే ఆ‌విషయం నాకు తెలుసు అని నందిని అంటుంది. కంపెనీలో అందరికి ఒక నెల బోనస్ ఇస్తానని నందిని అనగానే.. నేను కోల్పోయిన సంతోషం నాకు వచ్చింది అందుకే ఈ సంతోషం అని నందిని అంటుంది. ఆ తర్వాత నందిని సీతాకాంత్ కి థాంక్స్ చెప్పి వెళ్తుంది. మేడమ్ మీకెందుకు థాంక్స్ చెప్పిందని రామలక్ష్మి అంటుంది. అదే నాకు అర్థం అవడం లేదని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత ఫోటో షూట్ జరిగుతుంటే సీతాకాంత్ చెయ్యి పట్టుకుంటంది నందిని. దాంతో సీతాకంత్ చిరాకుగా వచ్చి.. రామలక్ష్మి నువ్వు వెళ్లి తనతో ఫోటో షూట్ చేయించు.. నువ్వు నాకు భార్యవి నాలో సగం.. ఇంకా యూనిట్ కి నీ పేరే కాబట్టి ప్రమోషన్ లాగా ఉంటుందని సీతాకాంత్ అనగానే.. సరేనని నందిని తో రామలక్ష్మి ఫోటో షూట్ చేయించుకుంటుంది. నందిని డిస్సపాయింట్ అవుతుంది. ఆ తర్వాత పెద్దాయన సీతాకాంత్ ని పిలిచి.. రాత్రి రామలక్ష్మికి నీ మనసులో మాట చెప్పావా అని అడుగుతాడు.‌ లేదని సీతాకాంత్ అనగానే.‌. ఇప్పుడు తీసుకొని వెళ్ళి చెప్పమని పెద్దాయన సలహా ఇస్తాడు.రామలక్ష్మిని తీసుకొని సీతాకాంత్ బయటకు వెళ్తుంటారు. ఆ మాటలు సందీప్ వింటాడు.

ఆ తర్వాత నందిని ఎదరుపడి ఎక్కడికి అంటుంది. మొక్కు తీర్చుకోవడానికి అని రామలక్ష్మి అనగానే.. ఇప్పుడు మీటింగ్ ఉంది సీతకాంత్ ఉండాలి.. నువ్వు వెళ్ళమని అంటుంది.‌ లేదు వెళ్తానని సీతాకాంత్ అనగానే మీటింగ్ కదా ఉండండి అని రామలక్ష్మి అంటుంది. రామలక్ష్మి ఒక్కతే వెళ్తుంది.‌ ఆ తర్వాత ఆస్తులు కంపెనీ సొంతం చేసుకోవాలని సందీప్ భావిస్తాడు. అన్నయ్య రామలక్ష్మి బయటకు వెళ్తున్నారు కదా అని కార్ బ్రేకులు ఫెయిల్ చేస్తాడు సందీప్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.