English | Telugu

Karthika Deepam2:  చాటుగా ఆ మాటలు విన్న జ్యోత్స్న.. కార్తీక్ ఆ పెళ్లి జరిపిస్తాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' కార్తీకదీపం-2'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-142 లో.. తను దాస్ కూతరనే నిజం తెలిసిన జ్యోత్స్న దీర్ఘంగా ఆలోచిస్తుంటుంది. నాకు ఈ ఆస్తి కావాలి.. ఈ తల్లిదండ్రుల ప్రేమ కావాలంటూ జ్యోత్స్న.. తన ఇంటినే కళ్లారా చూసుకుంటు దీపకి డ్యాష్ ఇస్తుంది‌. దీప అప్పుడే అటుగా ఇంట్లోకి వస్తూ ఉంటుంది. చూసుకోకుండా ఇద్దరు డ్యాష్ ఇచ్చుకుంటారు. ఏమైంది జ్యోత్స్నా.. వెనక్కి నడుస్తున్నావని దీప అంటుంది. వెంటనే జ్యోత్స్న కోపంగా.. ఇది నా ఇల్లు నేను ఎలాగైనా నడుస్తాను.. నువ్వు ఎందుకు చూసుకోలేదంటూ అరుస్తుంది. దాంతో దీప.. నేను బాగానే వస్తున్నాను.. నువ్వే వెనక్కి నడుస్తూ నా ప్లేస్‌లోకి వచ్చావని అంటుంది.

ఇక దీప ఇంటికి వచ్చేసరికి.. స్వప్న ఇంట్లో కూర్చుని ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. నువ్వు ఎప్పుడొచ్చావ్ స్వప్న అని దీప అంటుంది. జ్యోత్స్నతో మాట్లాడుతున్నప్పుడే వచ్చాను.. నేను నీతో మాట్లాడాలి దీపా.. అన్నయ్యని కూడా ఇక్కడికే రమ్మన్నాను.. తను కూడా వచ్చాక ఇద్దరితో ఒకేసారి మాట్లాడతానంటుంది. దాంతో దీప.. అయ్యో కార్తీక్ బాబుని ఎందుకు ఇబ్బంది పెట్టడం.. నాతో చెప్పొచ్చు కదా అని అంటుంది. మీరిద్దరూ భలే ఉన్నారు కదా.. ఒకరిని ఇబ్బంది పెట్టకూడదని ఒకరు.. తెగ ఆలోచిస్తారంటుంది స్వప్న. మరోవైపు ఆ దీపని పంపించాలని జ్యోత్స్న ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో కార్తీక్ కారు వచ్చి దీప ఇంటి ముందు ఆగుతుంది. ఆ కారు శబ్దం విన్న జ్యోత్స్న.. బావను నేనే వెళ్లి పలకరిస్తాను.. కొన్ని రోజులు నేను కాస్త తగ్గి ప్రవర్తించడం మంచిదని మనసులో అనుకుంటూ కార్తీక్ కోసం వెళ్తుంది. అయితే దీప ఇంట్లోకి వెళ్తాడు కార్తీక్. నాకు చావు తప్ప మరో మార్గం లేదని నేను అనుకుంటుండగా.. నాకు ఓ నిజం తెలిసింది ఏంటంటే.. కాశీ స్వయంగా అన్నయ్యకు బావమరిది.. అది నాకు చాలా నమ్మకాన్ని కలిగించింది.. లేదంటే వెళ్లిపోయి చేసుకోవడం తప్ప మరో దారే లేదుమో అంటూ స్వప్న.. దీపతో మాట్లాడుతూ ఉండగా.. కార్తీక్ ఎంట్రీ ఇస్తాడు. వాళ్లు మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్లే మాట్లాడుకుంటున్నారు? ఉన్నట్టుండి దీప దగ్గరకు ఎందుకు వచ్చాడంటూ జ్యోత్స్న.. దీప ఇంటి వైపు వస్తుంది. కాసేపు నేను చెప్పేది వింటావా.. ఈ పెళ్లి అంత ఈజీగా జరగదని కార్తీక్ అంటాడు. ఆ మాటలే జ్యోత్స్న విని షాక్ అయి అక్కడే చాటుగా నిలబడిపోతుంది.

ఆల్రెడీ ఇంట్లో పెళ్లి మాటలు అయ్యాయి.. ఒకసారి పెద్దవాళ్లు ఒక నిర్ణయం తీసుకున్నాక వాళ్లు అనుకున్నదే జరగాలి అనుకుంటారు. కానీ అది జరగదు.. నువ్వు కోరుకున్నట్లే ఈ పెళ్లి జరుగుతుంది. కానీ నువ్వు నన్ను ఇబ్బంది పెట్టొద్దు.. ఏం చేయాలో నన్ను కాస్త ఆలోచించుకోనివ్వు’ అంటాడు కార్తీక్. ఈ మాటలన్నీ స్వప్నకు కాకుండా దీపకు చెబుతున్నాను అనుకుంటుంది జ్యోత్స్న. ఇంతలో దీప అందుకుంటుంది. ఆలోచించుకునేంత టైమ్ ఎక్కడుంది బాబు అని దీప అంటుంది. ఇదేంటి వీళ్లు ఏకంగా వీళ్ల పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారని జ్యోత్స్న షాక్ అవుతుంది.. నిలదీద్దామనుకుంటుంది కానీ డైరెక్ట్ అయ్యిపోతారని ఆగిపోతుంది. మరోవైపు శౌర్య సైకిల్ వి బ్రేక్ బోల్ట్ తీసేస్తుంది పారిజాతం. ఇక బ్రేక్స్ పడక పారిజాతాన్ని గుద్దేస్తుంది శౌర్య.‌ అప్పుడు శివన్నారయణ వచ్చి.. కొత్త సైకిల్ కి బ్రేకులు పడటం లేదేంటని గట్టిగా అడుగగా.. పారిజాతం తీసిన బోల్ట్ ని వెతికి తీసుకొచ్చి శౌర్య సైకిల్ కి బిగిస్తుంది. ఇంకెప్పుడు ఇలాంటివి చేయవద్దని పారిజాతంపై శివన్నారాయణ‌ మండిపడతాడు. తరువాయి భాగంలో దీపని పంపించెయ్యాలి. బావను సొంతం చేసుకోవాలి.. దీపని పంపించాలంటే ఎలా..‌నాకు ఎవరు సాయం చేస్తారనుకుంటూ జ్యోత్స్న అనుకుంటు ఉండగా నరసింహ ఎంట్రీ ఇస్తాడు. ఆ సమయానికి దీప తల నిమురుతూ ఉంటుంది అనసూయ. అది చూసి రగిలిపోతాడు నరసింహ. ఆ తర్వాత ఏం జరిగిందో‌ తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.