English | Telugu

నువ్వు అమ్మాయివి కాదని తెలిసే ఇంకో పెళ్లి చేసుకున్నా!

జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ కామెడీ షోస్ లో లేడీస్ మీద పంచ్ డైలాగ్స్ మరీ శృతి మించిపోతున్నాయి. హైపర్ ఆది దారిలోనే ఇమ్మానుయేల్ కూడా నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఇమ్మానుయేల్, వర్ష ఇద్దరూ రీల్ జోడి అన్న విషయం అందరికీ తెలుసు. సందు దొరికితే చాలు ఇమ్ము వర్ష మీద కుళ్ళు జోకులు వేస్తూ చాలా హర్ట్ చేస్తూ ఉంటాడు. ఇలాంటి టైంలో వర్ష కూడా ఒక్కోసారి కౌంటర్ వేస్తుంది లేదంటే సైలెంట్ గా ఉంటుంది. ఈ కారణంగానే ఇద్దరి మధ్య కొంత కాలం గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ కొన్ని ఎపిసోడ్స్ లో కూడా బాగా ఫోకస్ అయ్యింది. ఇక ఇప్పుడు మళ్ళీ ఇమ్ము తన పాత స్టైల్ లోనే వర్ష మీద జోకులు వేయడం స్టార్ట్ చేసాడు.

ఎక్స్ ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. అందులో చూస్తే గనక ఇమ్మానుయేల్ మహారాజు గెటప్ వేశాడు. ఇక ఆయనకు భార్యగా వర్ష నటించింది. "నేను ఉండగా మరో అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నావ్?" అని వర్ష స్కిట్ లో భాగంగా ఒక డైలాగ్ చెప్పేసరికి "నిన్నుపెళ్లి చేసుకున్నాకే తెలిసింది అమ్మాయివి కాదని, అందుకే ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నా" అని సెటైర్ వేశాడు. ఇలాంటి డైలాగ్స్ ఉన్నప్పుడు స్కిప్ చేయాలని కూడా తెలీకుండా మరీ ఇలా ఒక అమ్మాయిని అవమానించండం ఎంత వరకు కరెక్ట్ అంటున్నారు ఆడియన్స్. "నువ్వు అమ్మాయి కాదు" అనగానే వర్ష మొహం సీరియస్ గా మారిపోయింది. మరి వర్ష ఇమ్మూకి రివర్స్ కౌంటర్ వేసిందా లేదా అనే విషయం తెలియాలంటే కొన్ని డేస్ వెయిట్ చేయాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.