English | Telugu

నాగార్జున ఆదిరెడ్డిని టార్గెట్ చేసాడా!

బిగ్ బాస్ హౌస్ లో శనివారం జరిగిన ఎపిసోడ్‌లో నాగార్జున కంటెస్టెంట్స్ చేసిన తప్పులు, టాస్క్ లలో వాళ్ళు చేసిన పర్ఫామెన్స్ గురించి మాట్లాడాడు.

నాగార్జున మాట్లాడుతూ "బిగ్ బాస్ హిస్టరీ లో‌ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ వీడియో ‌ఆఫ్ ది సీన్ చూపిస్తా" అని చెప్పి, గోస్ట్ టాస్క్ లో కంటెస్టెంట్స్ భయపడిన తీరును చూపించాడు. అందులో‌ ఆదిరెడ్డి భయపడిన విధానం హైలైట్ గా నిలిచిందని చెప్పగా, శ్రీసత్య బాగా చేసిందని, శ్రీహాన్ కూడా ‌బాగా చేసాడని చెప్పాడు. "సర్ అందులో నా పర్ఫామెన్స్ చూపించలేదు" అని అడుగగా ‌"నువ్వు ఎక్కడ భయపడ్డావ్" అని నాగార్జున ‌అన్నాడు. "నాకు యాక్ట్ చేయడం రాదు సర్.. నేను నాలాగే ఉంటాను" అని రేవంత్ అనగా "అంటే ఏంటి.. ఇప్పుడు శ్రీహాన్ యాక్ట్ చేసాడని అంటున్నావా రేవంత్" అని నాగార్జున చెప్పగా, "నా వీడియో వద్దు సర్" అని రేవంత్ అన్నాడు.

ఆ తర్వాత "ఏం ఆదిరెడ్డి.. శ్రీహాన్ బ్యాక్ బిచ్చింగ్ చేస్తాడా" అని అడుగగా, "ఏమో‌ సర్.. నాకైతే సరిగ్గా గుర్తులేదు" అని‌ ఆదిరెడ్డి అన్నాడు. ఆ తర్వాత "ఏం ఆదిరెడ్డి నువ్వు పెద్ద ఫ్లిప్పర్ ? అని అంటున్నారు ప్రేక్షకులు" అని నాగార్జున అడుగగా, "నేను ఎప్పుడు వేరే వాళ్ళ గురించి వాళ్ళ వెనుకాల మాట్లాడను సర్. కచ్చితంగా నాకు తెలియదు సర్. ఎందుకంటే నేను ఏదీ పర్ఫెక్ట్ గా చేయాలనుకోను" అని ఆదిరెడ్డి చెప్పాడు. అయితే ఇలా నాగార్జున, ఆదిరెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడటం గురించి సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.