English | Telugu

పూర్ణ బుగ్గ కొరుకుడుకు సెన్సార్ కట్ ప‌డిందిగా!

పూర్ణ పెట్టే ముద్దుల కోసం 'ఢీ' షోలో కంటెస్టెంట్ల కంటే మేల్ టీమ్ లీడర్లు, డ్యాన్స్ మాస్టర్లు పరితపిస్తున్నట్టు ఉన్నారు. పూర్ణ ఎవరికైనా ముద్దు ఇవ్వడం ఆలస్యం వెంటనే సుడిగాలి సుధీర్, హైపర్ ఆది రెడీ అవుతారు. కామెడీలో అదొక భాగం అని సరిపెట్టుకున్నా... 'ఢీ' షోలో ఈ ధోరణి రోజు రోజుకు శృతి మించుతున్నట్టు ఉంది.

ఆగస్టు 4న టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ లో కృష్ణ మాస్టర్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. కాన్సెప్ట్ ఏంటంటే... పూర్ణ బట్టలు ఉతకమని అతడి దగ్గరకు ఒకడు వస్తాడు. 'పూర్ణ అంటే ఢీలో డ్యాన్స్ బాగా చేసిన వాళ్లకు ముద్దులు పెడతారు. ఆ పూర్ణ మేడమా? బట్టలు బాగా ఉతికితే నాకు కూడా ముద్దులు ఇస్తారా?' అంటాడు. చెంప మీద ఒకటి ఇస్తాన్నట్టు నవ్వుతూ పూర్ణ ఎక్స్‌ప్రెషన్ ఇస్తుంది. చివరకు బాగా చేశాడని కృష్ణకు ముద్దు పెట్టింది.

ఇదే ఎపిసోడ్‌లో చైతన్య మాస్టర్‌కు కూడా ముద్దు పెట్టింది. దాన్ని ముద్దు అనడం కంటే బుగ్గ కొరుకుడు అంటే బెటర్. లాస్ట్ వీక్ ఎపిసోడ్ తర్వాత రిలీజ్ చేసిన ప్రోమోలో ఆ బుగ్గ కొరుకుడును శాంపిల్ గా చూపించారు. కానీ ఎపిసోడ్ లో మాత్రం చూపించలేదు. చైతన్య మాస్టర్ బుగ్గను పూర్ణ చేతితో తుడవడం వరకు చూపించారు. తర్వాత బుగ్గ కొరుకుడు లేదు. ప్రియమణి ఎక్స్‌ప్రెషన్ చూపించారు. పాత సినిమాల్లో ముద్దు సీన్లకు అడ్డంగా పువ్వును చూపించినట్టు. బహుశా... ఈటీవీ యాజమాన్యం లేదంటే మల్లెమాల ఎంటర్టైన్మెంట్ వాళ్లు బుగ్గ కొరుకుడుకు సెల్ఫ్ సెన్సార్ కట్ వేసినట్టు ఉన్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.