English | Telugu

హమ్మయ్య... అంజి చావలేదు! దీప ఏం చేసిందంటే...

అంజిని మోనిత చంపిందా? లేదా? అనే సందేహాల నడుమ 'కార్తీక దీపం' సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ ముగింది. చాలామంది అంజి చావకుండా ఉండాలని, మోనిత ఆటలు సాగకూడదని కోరుకున్నారు. వాళ్ళ కోరికలు గురువారం నాటి ఎపిసోడ్ లో నిజం కాబోతున్నాయి. అంజిని మోనిత చంపలేదు. మరి, ఏం చేసింది? భార్య ఎక్కడికి వెళ్లిందోనని టెన్షన్ పడుతున్న డాక్టర్ బాబు, ఇంటికి భార్య వచ్చిన తర్వాత ఏం చేశాడు? వంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ రోజు (ఆగస్టు 5, 2021) 1110 ఎపిసోడ్‌ను చూడాల్సిందే.

మోనిత చేతికి అంజి చిక్కిన సంగతి తెలిసిందే. అయితే, అతడిని మోనిత చంపలేదు. అతడిని చంపితే పెళ్లి ఆగిపోతుందేమోనని భయపడుతుంది. తుపాకీతో బెదిరించి తన మనిషి ద్రాక్షారామం సాయంతో కిడ్నాప్ చేస్తుంది. అదంతా వంటలక్క రికార్డ్ చేస్తుంది. ఆమె ఎక్కడికి వెళ్లిందో తెలియక డాక్టర్ బాబు కంగారు పడతాడు.

సీన్ కట్ చేస్తే... మోనిత తన ఇంటికి వెళ్లిపోతుంది. ఆమెతో 'అమ్మా మీ కోసం నిన్న రాత్రి కార్తీక్ (డాక్టర్ బాబు) వచ్చారు' అని ప్రియమణి చెబుతుంది. ఎందుకొచ్చాడోనని టెన్షన్ పడుతుంది మోనిత‌. వంటలక్క పిన్ని భాగ్యం కూడా మోనిత దగ్గరకు వెళ్లి 'నిన్ను చంపడానికి కార్తీక్ కత్తి పట్టుకుని తిరుగుతున్నాడు' అని అబద్ధం చెబుతుంది. పెళ్లిని ఆపడానికి మోనితను కిడ్నాప్ చేయాలనేది ఆమె ప్లాన్. అయితే, కార్తీక్ దగ్గర అంజి ఉన్నాడని చెబుతుంది. తన మనుషుల కస్టడీలో ఉన్న అంజిని కార్తీక్ దగ్గర ఉన్నాడని చెప్పడంతో భాగ్యం ఏదో నాటకం ఆడుతున్నదని మోనిత పసిగడుతుంది. డ్రామా మొదలుపెడుతుంది.

మరోవైపు ఇంటికి వెళ్లిన వంటలక్కను 'ఎక్కడికి వెళ్ళావ్' అని డాక్టర్ బాబు పదే పదే అడుగుతాడు. చివరకు, గట్టిగా నిలదీస్తాడు. అప్పుడు అంజిని మోనిత కిడ్నాప్ చేసినప్పుడు తీసిన వీడియోను డాక్టర్ బాబుకు వంటలక్క చూపిస్తుంది. ప్రజెంట్ అంజి ఎక్కడ ఉన్నాడో చెబుతుంది. అక్కడికి డాక్టర్ బాబు వెళ్తాడు. అంజిని చూసి షాక్ అవుతాడు. తర్వాత ఏం జరిగిందనేది శుక్రవారం ఎపిసోడ్ లో చూడాలి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.