English | Telugu

నీకే ఒకడు డబ్బింగ్‌ చెప్పాలి.. నువ్వు ఇంకొకడికి డబ్బింగా?

యాంగ్రీ స్టార్‌ రాజశేఖర్‌ మేనరిజమ్‌ను కాపీ కొట్టి కామెడీ చేసినోళ్లు వున్నారు. సినిమాల్లో అయితే ‘గబ్బర్‌ సింగ్‌’లో రాజశేఖర్‌ మీద చేసిన సీన్‌ హైలైట్‌ అయ్యింది. టీవీల్లో అయితే ‘జబర్దస్త్‌’ స్టేజి మీద కొంతమంది కామెడీ చేశారు. లేటెస్ట్‌గా రాజశేఖర్‌ను ఇమిటేట్‌ చేస్తూ... ‘చలాకి’ చంటి స్కిట్‌ చేశాడు. అందులో అతడితో పాటు టీమ్‌ మెంబర్స్‌ బాబీ, నూకరాజు కూడా రాజశేఖర్‌ ‘అల్లరి ప్రియుడు’, ‘శేషు’ సినిమాల్లో క్యారెక్టర్లను అదే స్కిట్‌లో ఇమిటేట్‌ చేశారు. ఇమిటేషన్లు కామనే. కానీ, ఓ డైలాగ్‌ మాత్రం అభ్యంతరకరంగా ఉంది.

‘ఎక్కడికి వెళ్లావురా? లేట్‌ అయ్యింది??’ అని ఒకరు అడిగితే... ‘నేను సినిమా ఆఫీసుకు వెళ్లి డబ్బింగ్‌ చెప్పి వచ్చినాను’ అని తమిళ యాసతో మిక్స్‌ చేసిన తెలుగులో బాబీ ఆన్సర్‌ ఇచ్చాడు. వెంటనే ‘నీకే ఒకడు డబ్బింగ్‌ చెప్పాలి. నువ్వు ఇంకొకడికి డబ్బింగా?’ అని చంటి అన్నాడు. రాజశేఖర్‌ చూస్తే ఆయన కొంచెం నొచ్చుకునే డైలాగ్‌ ఇది. రోజా అంత ఆలోచించారో? లేదంటే మనసులో ఉన్నది చెప్పారో? జడ్జ్‌మెంట్‌లో ఆవిడ చెప్పిన మాటలు వింటుంటే కవరింగ్‌లా ఉంది.

‘‘బావుంది చంటి. ఎన్టీఆర్‌గారిని, నాగేశ్వరరావు, నాగార్జునగారిని మనం మళ్లీ గుర్తు చేసుకుంటున్నాం. వాళ్లను ఇష్టపడుతున్నాం కాబట్టే. సో... ఆ విధంగా ఒక మంచి ఆర్టిస్టును అందరూ ఒకేలా చేయడం బావుంది’’ అని రోజా జడ్జ్‌మెంట్‌ ఇచ్చారు. రాజశేఖర్‌ మంచి ఆర్టిస్టు అని ఆవిడ చెప్పారు. అందులో సందేహం లేదు. అంతకు ముందు ‘నీకే ఇంకొకరు డబ్బింగ్‌ చెప్పాలి’ అని చంటి అన్నాడు. దానికి ఆవిడ జడ్జ్‌మెంట్‌ కవరింగ్‌లా ఉందనేది కొందరి అభిప్రాయం.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.