English | Telugu

శ్రీ‌ముఖిని ఎత్త‌లేక చ‌తికిల‌ప‌డ్డ ష‌క‌ల‌క శంక‌ర్‌!

యాంకర్‌, యాక్ట్సెస్‌ శ్రీముఖి ముద్దుగా, కొంచెం బొద్దుగా ఉంటుంది. ఓ విధంగా చెప్పాలంటే... భారీ పర్సనాలిటీ. రెగ్యులర్‌గా యాంకర్లు, హీరోయిన్లు మెయిన్‌టైన్‌ చేసే వెయిట్‌ కంటే శ్రీముఖి వెయిట్‌ ఎక్కువే. అయినా అందంగా ఉంటుంది. చ‌క్క‌గా యాంకరింగ్‌, యాక్టింగ్‌ చేస్తుంది. అందుకని, ఆమెకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. శ్రీముఖి వెయిట్‌ ఎంతనేది అంచనా వెయ్యకుండా ఎత్తుకోవాలని ‘షకలక’ శంకర్‌ ట్రై చేశాడు. అయితే, అతడి వల్ల కాలేదు. దాంతో అతడే కింద పడ్డాడు. ఆదివారం జీ తెలుగులో టెలికాస్ట్‌ కానున్న ‘దసరా దోస్తీ’లో నవ్వించే ఈ సంఘటన చోటు చేసుకుంది.

శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా నటించిన ‘పెళ్లి సందడి’ విజయదశమికి విడుదల కానుంది. సినిమా ప్రమోషన్‌ కోసం ‘షకలక’ శంకర్‌తో కలిసి ‘దసరా దోస్తీ’కి వచ్చాడు. శ్రీముఖిని ఎత్తుకోవడానికి విఫల యత్నం చేశాక... ‘ఈ బొప్పాయి మామూలు బొప్పాయి కాదు అల్లుడు’ అని ‘షకలక’ శంకర్‌ డైలాగ్‌ చెప్పాడు.

మెగా మేనల్లుడు వైష్ణవ్‌తేజ్‌ కూడా ‘దసరా దోస్తీ’లో సందడి చేశాడు. అతడితో స్టెప్పులేసిన భానుశ్రీ.. శ్రీముఖిని ఆటపట్టించే ప్రయత్నం చేసింది. దాంతో ‘నాలోని సేతుపతిని నిద్రలేపకు’ అని శ్రీముఖి అంటే... ‘మీరు మీరు గొడవపడి సేతుపతి అంటే నా దగ్గరకు వస్తుందండీ’ అని వైష్ణవ్‌ అన్నాడు. మొత్తం మీద ‘ఉప్పెన’ ప్రస్తావన వస్తే... క్లైమాక్స్‌ టాపిక్‌ ఎక్కడ వస్తుందోనని అవాయిడ్‌ చేస్తున్నట్టు ఉన్నాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.