English | Telugu

రోహిణికి తాళి క‌ట్టిన‌ బులెట్ భాస్కర్ నాన్న!

ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఈ వారం కామెడీ కొంచెం ఎక్స్ట్రా గానే ఉందనిపిస్తోంది. ఈ సీరియల్ నెక్స్ట్ వీక్ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో రిలీజ్ అయ్యింది. ఐతే జబర్దస్త్ స్టేజి ద్వారా పరిచయమైన కమెడియన్స్ అంతా వాళ్ళ వాళ్ళ ఫామిలీ మెంబెర్స్ ని కూడా స్కిట్స్ లో ఇన్వాల్వ్ చేయించడం కొంత కాలం నుంచి గమనిస్తున్నాం. అలాగే కొన్ని నెలల నుంచి బులెట్ భాస్కర్ వాళ్ళ నాన్న ఈ జబర్దస్త్ లో కొడుకుతో పాటు పోటాపోటీగా స్కిట్స్ చేస్తున్నారు. ఈ వారం ఎపిసోడ్ లో కూడా ఆయన తన కామెడీని పండించడానికి ట్రై చేశారు.

వీల్ చైర్ మీద ఉన్న బులెట్ భాస్కర్ వాళ్ళ నాన్నను రోహిణి పెళ్లి చేసుకుంటుంది.తర్వాత వెంటనే వీల్ చైర్ లోంచి లేచి ఫస్ట్ నైట్ కి అరేంజ్ చేయమంటూ కొమరంని ఆర్డర్ వేస్తాడు బులెట్ భాస్కర్ నాన్న. అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. "ఇప్పుడే పెళ్లయింది కదా నా కోసం ప్రేమగా ఏవైనా రెండు డైలాగులు చెప్పొచ్చు కదా" అంటుంది రోహిణి. అంతే బులెట్ భాస్కర్ వాళ్ళ నాన్న రెచ్చిపోతాడు. " నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతాను, కానీ నేను చచ్చిపోతే నువ్వు ఏడవద్దు " అంటూ ఒక మినీ కవితను లవ్ ప్రపోజ్ యాంగిల్ లో చెప్పాడు.

రోహిణి ఆ డైలాగ్ కి షాక్ అయ్యి వెంటనే అందుకుంటుంది. "ఇంతకు ముందు ఒకడుండేవాడు. తొమ్మిది సంవత్సరాలు ఇలా చెప్పి చెప్పి వెళ్ళిపోయాడు" అంది రోహిణి. "అందుకే వాడు పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయాడు" అంటూ పంచ్ వేశాడు భాస్కర్ వాళ్ళ నాన్న. ఆయన డైలాగ్ కి రష్మీ ముఖం మాడ్చేస్తుంది. ఎందుకంటే ఈ కామెంట్ సుధీర్ ని ఉద్దేశించి అన్నట్లుగా క్లారిటీగా అర్థమైపోతుంది. ఇలా ఈ వారం స్కిట్స్ ఎక్స్ట్రా ఎనెర్జీని ఆడియన్స్ కి అందించబోతున్నాయి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.