English | Telugu

నాన్న ఫొటో చూసి ఎమోష‌న‌ల్ అయిన గోపీచంద్‌

'పక్కా కమర్షియల్' మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండేసరికి టీమ్ మొత్తం ప్రమోషన్స్ మీద ప్రమోషన్స్ చేస్తూ బుల్లితెర మీద అన్ని షోస్ లో వాళ్ళే కనిపిస్తున్నారు. ఇప్పుడు తాజాగా క్యాష్ ప్రోగ్రాంకి వచ్చి టీం మొత్తం ఫుల్ మస్తీ చేసింది. సుమ కూడా 'పక్కా కమర్షియల్' అంటూ ప్రతీ దానికి డబ్బులు అడుగుతూ వచ్చింది. ఇటీవల జబర్దస్త్ లో సందడి చేసిన ఈ టీం డైరెక్టర్ మారుతి..అనసూయకు పక్కా కమర్షియల్ అంటూ కితాబిచ్చాడు. ఇక క్యాష్ కి వచ్చిన టీమ్ తో ఫుల్ గా గేమ్స్ ఆడించి ఎంటర్టైన్ చేసింది సుమ. ఇక ప్రోమో ఎండింగ్ లో గోపీచంద్ నాన్న టి. కృష్ణ ఫోటో చూపించింది. ఆ ఫోటోని చూసేసరికి గోపీచంద్ ఫుల్ గా ఎమోషన్ ఐపోయాడు.

"దాదాపు నా తొమ్మిదేళ్ల వయసులో నాన్న చనిపోయారు. చిన్నప్పుడే జీవితం నాకు చాలా నేర్పించింది" అంటూ బాధపడ్డారు. "నాకు ఇప్పుడు తెలుస్తోంది అసలు నేనేం కోల్పోయానో.. మా నాన్నతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయా" అనేసరికి అక్కడ ఉన్న అందరి కళ్ళు చెమ్మగిల్లాయి. ఇప్పుడు ఈ ప్రోమో వైరల్ అయ్యింది. గోపీచంద్ 'తొలివలపు' మూవీతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఐతే ఇటీవల ఆయన నటించిన మూవీస్ అన్నీ ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి. కానీ 'సీటీమార్' విజయంతో మళ్ళీ గోపీచంద్ గాడినపడ్డాడు. తాజా చిత్రం 'పక్కా కమర్షియల్' మంచి హిట్ అవుతుంది అనే ఆశతో ఉన్నాడు. ఈ మూవీ హిట్ ఐతే మాత్రం గోపీచంద్ కి మళ్ళీ దశ తిరిగినట్టే అంటున్నారు ఆడియన్స్.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.