English | Telugu

ఈ లుక్‌ను బాలీవుడ్ హీరోయిన్లు కాపీ కొడుతున్నారంట‌!

స్టార్ యాంకర్ అనసూయ త్వరలో బాలీవుడ్ స్క్రీన్ మీద సందడి చేయనుందా? ప్రస్తుతం ఆమె ఒక బాలీవుడ్ ప్రాజెక్ట్ చేచేస్తుందా? అనసూయ సోషల్ మీడియా పోస్ట్ చూస్తే ఇటువంటి సందేహాలు కలుగక మానదు.

ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టుల్లో ఒక ప్రాజెక్ట్ నుండి తన లుక్‌ను అనసూయ రివీల్ చేసింది. అయితే, అది సినిమానా? సీరియలా? వెబ్ సిరీసా? అనేది చెప్పలేదు. ప్రాజెక్ట్ టైటిల్, ఇతరత్రా వివరాలు సస్పెన్స్‌లో ఉంచింది. ఒక్కటి మాత్రం క్లారిటీగా చెప్పింది... తన లుక్‌ను బాలీవుడ్ జనాలు కాపీ కొడుతున్నారని!

"గౌరీ నాయుడు (అనసూయ స్టయిలిస్ట్, కాస్ట్యూమ్ డిజైనర్) మరో స్నేహితురాల్ని చూడండి. మిస్ సి! మేమిద్దరం కలిసి చేస్తున్న ప్రాజెక్టుల్లో ఒక పాత్ర ఆమె. అంతకు మించి ఏమీ చెప్పలేను. ఈ లుక్‌ను కాపీ చేయడానికి చాలామంది తారలు ప్రయత్నిస్తున్నారు. మా సెట్స్ నుండి బాలీవుడ్ కు తీసుకు వెళ్తున్నారు. అవును... నిజమే! గౌరీ, నేను ఎంతో మనసుపెట్టి ఈ లుక్ క్రియేట్ చేసినందుకు గర్వంగా ఫీలవుతున్నాం. మిస్ సి.. త్వరలో" అని అనసూయ పేర్కొంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.