English | Telugu

నా జీవితం చేజారింది, పారేసుకున్నా!.. కార్తీక్ ఆవేదన!!

మోనిత జైలుకు వెళ్లినా... వెళ్లేముందు 'రీ-ఎంట్రీ ఇస్తా! బిడ్డతో వస్తా' అన్న మాటలే కార్తీక్‌కు గుర్తుకు వస్తాయి. అవి తలుచుకుని, మోనిత ఏం చేస్తుందోనని ఆలోచిస్తుంటాడు. దీనికి తోడు పిల్లలు ఎక్కడికైనా వెళదామని అడగంతో అవునని అంటాడు. మోనితకు భయపడి పిల్లలను తీసుకుని ఎక్కడికి వెళతాడు? అమెరికానా? విశాఖపట్టణమా? కార్తీక్ అండ్ ఫ్యామిలీ ఎక్కడికి వెళుతుందనేది ఆసక్తికరంగా మారింది. 'కార్తీక దీపం' సీరియల్ ఇవాళ (సెప్టెంబర్ 21, 2021) 1550 ఎపిసోడ్‌లోకి ప్రవేశించింది. ఈ రోజు ఏం జరిగింది? అనే వివరాల్లోకి వెళితే...

మోనిత మాటలను తలచుకుంటూ కార్తీక్ బాధ పడుతుంటే... అతడి దగ్గరకు భార్య దీప, తల్లితండ్రులు ఆనందరావు, సౌందర్య వెళతారు. 'నా జీవితం నా చేతుల్లోంచి చేజారిపోయింది. పారేసుకున్నాను' అని కార్తీక్ తన ఆవేదన, బాధను పంచుకుంటాడు. 'ఇప్పటికైనా దాని (మోనితను ఉద్దేశిస్తూ) పీడ విరగడైంది. దాన్ని మనసులోంచి తీసేయండి' అని భర్తకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తుంది దీప. అయినా కార్తీక్ కుదుటపడడు. మనసులోంచి తీసేయడానికి... మర్చిపోయేంత చిన్న విషయం కాదని కార్తీక్ అంటాడు.

'అది జైలుకు ఒంటరి వెళ్లి ఉంటే... నువ్వు చెప్పినట్టు అన్నీ మర్చిపోయి హుషారుగా అందరితో కబుర్లు చెబుతూ ఆనందంగా గడిపేవాడిని. కడుపులో బిడ్డతో వెళ్ళింది. ఒక అణుబాంబును మోసుకువెళ్ళింది. ఆ బాంబు ఎప్పుడు పేలుతుందో? అదెంత బలమైందో? దానికి మనలో ఎంత మంది బలైపోతారో? ఊహించుకోవడానికి భయంగా ఉంది' అని కార్తీక్ అంటాడు. దాంతో దీపలో ఒక అంతర్మథనం మొదలవుతుంది. కార్తీక్ నుండి పక్కకు జరుగుతుంది. ఇటువంటి ఆలోచనలు ఆపమని, ప్రశాంతంగా ఉండమని కొడుక్కి సౌందర్య చెబుతుంది. మేడ మీద నుండి కిందకు వెళుతూ వెళుతూ కోడలితో 'ఏడుస్తూ కూర్చోక కిందకి వాడిని తీసుకునిరా' అంటుంది. మరోవైపు మోనితకు తక్కువ శిక్ష పడిందని కార్తీక్ తమ్ముడు ఆదిత్య, మరదలు శ్రావ్య చర్చించుకుంటారు.

కార్తీక్‌తో పిల్లలు 'కొన్ని రోజులు ఎక్కడికైనా వెళదాం నాన్నా' అంటారు. అందుకు దీప ఒప్పుకోదు. 'నో' అంటుంది. కార్తీక్ మాత్రం సరేనంటాడు. 'ఎక్కడికి వెళదాం?' అని అడుగుతాడు. 'వైజాక్' అంటుంది సౌర్య. అక్కడికి వచ్చిన సౌందర్య ఎక్కడికి వెళ్లవద్దని, తన కళ్ళముందు ఉండమని అంటుంది. 'ఇప్పుడు ఇలా అంటున్నావ్ కానీ, అమెరికాకు వెళ్ళిపోతే ఏం చేస్తావ్?' అని సౌర్య ప్రశ్నిస్తుంది. 'అమెరికాకు వాళ్ళిద్దర్నీ పంపిస్తా కానీ మిమ్మల్ని పంపించను' అని సౌందర్య అనడంతో సౌర్య ఎమోషనల్ అవుతుంది. కొంత డిస్కషన్ జరిగాక 'సరదాగా అన్నాను' అని సౌందర్య సర్దిచెప్పే ప్రయత్నం చేస్తుంది. 'సరదాగా అన్నా... అదే జరిగితే బావుంటుంది. ఆలోచించండి' అని ఆదిత్య అంటాడు. తమ్ముడి మాటలతో అదే సరైనదేమోనని కార్తీక్ ఆలోచనలో పడతాడు. మరి, ఫ్యామిలీ అంతటినీ ఎక్కడికైనా తీసుకువెళతాడా? లేదా? అన్నది రాబోయే రోజుల్లో చూడాలి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.