English | Telugu

మోస్ట్ వరెస్ట్ కంటెస్టెంట్ గా ఆఫ్ ది సీజన్ గా విష్ణుప్రియ!

బిగ్ బాస్ సీజన్-8 ఇప్పటికి తొమ్మిది వారాలు పూర్తయ్యాయి. ఇప్పుడు పదో వారం నడుస్తోంది. ఇక హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్, వీక్ కంటెస్టెంట్స్ అంటు ఓ కేటగిరీ తీస్తే వారిలో కన్నడ బ్యాచ్ తమ మాటలతో, ఆటలతో, స్ట్రాటజీలతో సూపర్ గా రాణిస్తున్నారు.

నబీల్ గేమ్ ఛేంజర్.. కానీ అతని ఒకే ఒక్క వీక్ నెస్ మాట. ఒక్కసారి అతను మాట ఇస్తే అది చేస్తాడు. ‌కానీ ఇది గేమ్ షో.‌ ఇక్కడ ఎవరి గేమ్ వారికి ఉంటుంది. టాస్క్ లు బాగా ఆడిన సరైన స్ట్రాటజీ ప్లే చేయకుంటే ఓడిపోవాల్సిందే. ప్రతీసారీ నబీల్ కి అదే జరుగుతుంది. ఎవరికోసమో త్యాగం చేస్తూ తన కంటెండర్ షిప్ ని కోల్పోతున్నాడు‌. ఇలాగే ఉంటే కన్నడ బ్యాచ్ నబీల్ ని జోకర్ కార్డు లా వాడుకొని వదిలేస్తారు.‌ ఇక టాప్-5లో ఉన్నా నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, యష్మీ చేస్తున్న స్ట్రాటజీలలో‌ నబీల్ షేర్ కాదు జీరో అవుతాడు.

మరోవైపు బిగ్ బాస్ మామ ఎడిట్ చేసే ప్రోమోలు, ఎపిసోడ్ లు అంతా విష్ణుప్రియకి ఫేవర్ గాను మిగతావారికి నెగెటివ్ గాను ఉంటున్నాయి. ఇప్పటివరకు జరిగిన ఒక్క టాస్క్ లో కూడా గెలవలేదు విష్ణుప్రియ.. చెత్త రీజన్స్ తో నామినేషన్ చేసినా, పృథ్వీకి బహిరంగంగా కిస్సులు, హగ్గులు ఇచ్చినా బిగ్ బాస్ తన ఫుల్ సపోర్ట్ ఇచ్చేస్తున్నాడు. దీన్ని బట్టి చూస్తే మన నత్తి బ్రెయిన్ విష్ణుప్రియని టాప్-5 కి తెచ్చే ఆలోచనలో బిగ్ బాస్ మామ ఉన్నట్టు తెలుస్తోంది. నిన్నటి లైవ్ ఎపిసోడ్ లో ఓ వైపు బిగ్ బాస్ టాస్క్ గురించి అనోన్స్ మెంట్ చేస్తుంటే పృథ్వీ వేసుకున్న షూ లేస్ ని కడుతుంది విష్ణుప్రియ. దాంతో బిగ్ బాస్ మామ తనని అలర్ట్ చేసి మళ్ళీ రూల్స్ చెప్తుంటాడు. లైవ్ లో ఇది ఉంది కానీ ఇది విష్ణుప్రియని నెగెటివ్ చేస్తోందని భావించిన బిగ్ బాస్ ఎడిటర్ మామని లేపేయమన్నాడు. ఇంకేం ఉంది విష్ణుప్రియని నెగెటివ్ చేసే కంటెంట్ అంతా లేపేస్తున్నారు బిబి టీమ్. ఇక జెన్యున్ గా ఆడే టేస్టీ తేజ, రోహిణి, అవినాష్, నబీల్, ప్రేరణ వారి పరిస్థితి ఏంటో.. ఇదో షో అని మర్చిపోయి విష్ణుప్రియ ఏం చేసినా కరెక్ట్.. అంటు మిగతావారిని తప్పుగా చూపిస్తున్నారు. ఓటింగ్ లో మాత్రం విష్ణుప్రియకి స్ట్రాంగ్ ఉంది. ఇది నిజమేనా లేక బిబి టీమ్ అంతా కలిసి ఓట్లు వేపిస్తున్నారో చూడాలి. ఇది ఇలానే ఉంటే జెన్యున్ గా ఆడే కంటెస్టెంట్స్ కి తీవ్ర నిరాశే మిగులుతుందనడంలో ఆశ్చర్యం లేదు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.