English | Telugu

అఖిల్ కామెంట్స్ కి నిఖిల్ కౌంటర్...ప్రతీ ఒక్కరికీ ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు

పొలిటికల్ కామెంట్స్ మాత్రమే కాదు.. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు చేసే కామెంట్స్ బయట వాళ్ళ ఫాన్స్ కానీ ఇతరత్రా ఎక్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ చేసే కామెంట్స్ కూడా బాగా డిబేటబుల్ అవుతాయి.. అలాగే కాంట్రవర్సి కూడా క్రియేట్ అవుతూ ఉంటాయి. ఐతే రీసెంట్ గా బిగ్ బాస్ 8 కి సంబంధించి గత బిగ్ బాస్ కంటెస్టెంట్ అఖిల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దీనికి నిఖిల్ కౌంటర్ ఇచ్చాడు ఒక ఇంటర్వ్యూలో. "గౌతమ్ రియల్ విన్నర్ కానీ గౌతమ్ ని బిగ్ బాస్ విన్నర్ ని చేయాలనుకోవడం లేదు..నిఖిల్ ని విన్నర్ ని చేయాలనుకుంటోంది..ఏదో జరుగుతోంది" అంటూ కొన్ని రోజుల క్రితం ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.

ఇక అఖిల్ సార్ధక్ బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ అలాగే ఓటిటికి వెళ్ళొచ్చాడు. దీనిపై నిఖిల్ ఏమన్నాడంటే "రెండు సార్లు గెలిచిన వాళ్ళు మా టీవీ వాళ్ళు కాదేమో..అఖిల్ కి ఈ విషయం తెలీదేమో..ఇండస్ట్రీకి వచ్చింది నేను ఏది జరిగినా రిసీవ్ చేసుకోవడానికి...ఏదో ఒకటి అన్న ప్రతీ ఒక్కరికీ ఆన్సర్ చేయను. స్టార్ మా వాడిని అని బిగ్ బాస్ గెలిపించారు అని అఖిల్ అనుకుంటే ఒకే ...నిఖిల్ జెన్యూన్ గా ఆడాడు అని కొందరు అనుకుంటారు. దానికి కూడా ఒక ఎవరు ఎలా అనుకున్నా దానికి కూడా ఓకే...నాకొచ్చే ఇబ్బందేం లేదు" అన్నట్టుగా చెప్పాడు బిగ్ బాస్ 8 విన్నర్ నిఖిల్.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.