English | Telugu

టీఆర్పీలో నెంబర్ వన్ గా నిలిచిన గుండెనిండా గుడిగంటలు!

తెలుగు టీవీ సీరియల్స్ అన్నింటిలో స్టార్ మా టీవీలో ప్రసారమయ్యే సీరియల్స్ కి ప్రతీ వారం అత్యధిక టీఆర్పీ వస్తుంది. అయితే గత నాలుగు నెలల క్రితం వరకు బ్రహ్మముడి సీరియల్ నెంబర్ వన్ లో నిలవగా.. ప్రస్తుతం ఆ రికార్డుని గుండెనిండా గుడిగంటలు సీరియల్ బ్రేక్ చేసింది.

గుండెనిండా గుడిగంటలు సీరియల్ లో బాలు, మీనాల పాత్రలు తెలుగువారికి తెగ నచ్చేస్తాయి. మొదట్లో తాగుతూ భాద్యత లేకుండా కన్పించిన బాలు, మీనాని పెళ్ళి చేసుకొని కామన్ మ్యాన్ గా మారిపోయాడు. ఇక బాలు వాళ్ళ అమ్మ చిన్నతనంలోనే తనని జైలులో పెట్టించడంతో.. అమ్మ ప్రేమకి దూరమయ్యాడు. ఇక వాళ్ళ అమ్మ చేసే అప్పులకి ఇళ్ళంతా బాదల్లోకి వెళ్ళడంతో కుటుంబ భారాన్ని బాలు తీసుకుంటాడు. బాలుని అర్థం చేసుకునే భార్యగా మీనా సపోర్ట్ ఇస్తుంది. ఇదే ప్రస్తుతం ఈ సీరియల్ ని నెంబర్ స్థానంలో నిల్చోబెట్టింది. అయితే స్టార్ మా సీరియల్స్ లో ఇల్లు ఇల్లాలు పిల్లలు, నువ్వుంటే నా జతగా లాంటి కొత్త సీరియల్స్ రావడంతో సాయంత్రం టైమ్ స్లాట్ నుండి బ్రహ్మముడి సీరియల్ ని తీసి మధ్యాహ్నం టైమ్ స్లాట్ లో వేయడంతో బ్రహ్మముడి టీఆర్పీ పడిపోయింది.

గుండెనిండా గుడిగంటలు సీరియల్ 9.27 తో అగ్రస్థానంలో ఉండగా, పడమటి సంధ్యారాగం 9.11 తో రెండో స్థానంలో ఉంది. కార్తీకదీపం-2 సీరియల్ 8.90 రేటింగ్ తో మూడో స్థానంలో ఉండగా, ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కి 8.47, మేఘసందేశం సీరియల్ కి 8.38 రేటింగ్ వచ్చేసింది. ఇక ఈ వారం టాప్-5 లో మూడు స్టార్ మా సీరియల్స్ చోటు దక్కించుకున్నాయి.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.