English | Telugu

నామినేషన్ లో సోనియా డామినేషన్.. ఛీఫ్ లకి బొమ్మ చూపించిందిగా!

బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు మొదలై మూడు రోజులే అవుతుంది‌. కానీ అప్పుడే కంటెస్టెంట్స్ మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్ మొదలయ్యాయి. నామినేషన్ల ప్రక్రియతో ఒక్కసారిగా బిగ్ బాస్ హౌస్ హీటెక్కింది.

సోనియాతోనే నామినేషన్ ప్రక్రియ మొదలుపెట్టాడు బిగ్‌బాస్. మందుగా బేబక్కను నామినేట్ చేసింది సోనియా. కుక్కర్ వాడటం రాకపోతే చెప్పాలి కానీ మమ్మల్ని అందరినీ అంతసేపు ఆకలితో ఉంచుతావా అంటూ ఇదే పాయింట్ మీద, కిచెన్ హ్యాండిలింగ్‌పైనా కారణాలు చెప్పి నామినేట్ చేసింది సోనియా. ఇక దీనికి బేబక్క డిఫెండ్ చేసుకునేందుకు ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు సోనియా. పైగా మధ్యలో మాట్లాడటానికి వచ్చిన చీఫ్‌లు ముగ్గురినీ కూడా వాయించేసింది. ఇది నా గేమ్.. నేను మాట్లాడతా.. చీఫ్స్‌ ఏం జడ్జీలు కాదు.. ఇది నామినేషన్.. మా డిస్కషన్లలో నువ్వు చెప్పు.. నువ్వు ఆగు అని చెప్పడానికి మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టలేదంటూ గట్టిగానే ఇచ్చిపడేసింది.

రెండో నామినేషన్‌గా ప్రేరణను సెలక్ట్ చేసింది సోనియా. ఇదేదో పిక్నిక్ లాగా, ఏదో ఎంజాయ్‌మెంట్‌లా నువ్వు ఫీలవుతున్నావ్.. ఎవరైనా గొడవ పడుతుంటే ఎందుకు కావాలని గొడవ పడుతున్నారంటూ డైలాగ్‌లు వేస్తున్నావంటూ నామినేట్ చేసింది. దీనికి ప్రేరణ డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేయగా సోనియా చిన్న ఛాన్స్ కూడా ఇవ్వలేదు. అసలు సోనియా నామినేట్ చేసినంత సేపు అవతలి వాళ్లకే కాదు చీఫ్‌లు కూడా సైలెంట్ అయిపోయారు. అంత డామినేషన్ గా మాట్లాడింది సోనియా. ఇక బేబక్క, ప్రేరణలో ఎవరో ఒకరిని మాత్రమే డిసైడ్ చేసి నామినేట్ చేసే బాధ్యత చీఫ్‌లపై ఉంటుంది. కాబట్టి యష్మీ పరుగున వెళ్లి ఆ కత్తి తీసుకొని నామినేషన్లో ఉన్న ఇద్దరిలో తన ఫ్రెండ్ ప్రేరణను సేవ్ చేసి బేబక్కను నామినేట్ చేసింది. ఇక్కడ కూడా కన్నడ బ్యాచ్ అంతా ఒకటే అన్నట్టుగా చేసేశారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.