English | Telugu

Biggboss 8 Promo: కిర్రాక్ సీతకి  కిరీటం... నిఖిల్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున!


బిగ్ బాస్ సీజన్ 8 శనివారం నాటి ప్రోమో రానే వచ్చింది. ఇక హౌస్ లో ఎవరెవరు ఏంటని చెప్తూ నాగార్జున క్లాస్ పీకుతాడని అందరు ఎదురుచూస్తుంటారు.

నాగార్జున వచ్చీ రాగానే హౌస్ లో హీరో ఎవరు జీరో ఎవరో చెప్పమంటూ వారికి కిరీటం తొడగమన్నాడు. అందులో మొదటగా కిర్రాక్ సీతకి మణికంఠ కిరీటం పెట్టగా.. తను నీకే కాదు మాకు కూడా హీరో అని నాగార్జున అన్నాడు. ' థ్రీ అవర్స్ ఫేస్ మీద చిరునవ్వు చెరగకుండా ఉన్నావ్.. యూ ఆర్ జస్ట్ బికమింగ్ మై డొపమైన్ ఆ' అని పృథ్వీతో నాగార్జున అనగానే.. విష్ణుప్రియ ఫుల్లుగా నవ్వేసింది. ఎందుకు నవ్వుతున్నావని విష్ణుప్రియని నాగ్ అడిగాడు. ఇక ఆ తర్వాత ఆటలో జీరో అయిపోతుందెవరో వారి ఫేస్ మీద మార్క్ వేయమన్నాడు. నైనిక ఫేస్ మీద నాగ మణికంఠ మార్క్ వేస్తుండగా.. 200% రైట్ మణికంఠ అని నాగార్జున అన్నాడు. ఇక ఎందుకు ఓవర్ థింక్ చేస్తున్నావని మణికంఠని నాగార్జున అడుగగా.‌. నాకు అదే అర్థమై చావడం లేదు సర్ అని అన్నాడు.

ఆ తర్వాత నిఖిల్ కి ప్రేరణ మార్క్ వేసింది. యునైటెడ్ గా గేమ్ ఆడాలని బిగ్ బాస్ చెప్పినప్పుడు.. వాడు క్లాన్ కి ఇంపార్టెంటెన్స్ ఇచ్చి హౌస్ ని పక్కన పెట్టేశాడు.. నాకు అనిపించిందని ప్రేరణ అనగానే.. నీకే కాదు ప్రేరణ మాకు అనిపించిందని నాగ్ అన్నాడు. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ టాస్క్ లో నబీల్ ని ఎందుకు తీసావ్‌.. నీ డెసిషన్ కరెక్టేనా అని అడుగగా.. మిస్ బ్యాలెన్స్ అయ్యిందని నిఖిల్ అన్నాడు. మిస్ బ్యాలెన్స్ అవ్వడానికి ఏ మిస్ కారణమని నాగ్ అడుగగా.. నిఖిల్ మొహం వాడిపోయింది. నువ్వు చీఫ్ గా ఉన్నప్పుడు నీ క్లాన్ లోకి రావడానికి ఎవరు ఇష్టపడలేదు ఎందుకో ఆలోచించావా అని నిఖిల్ ని అడుగగా.. మేమ్ ఏం చేసిన ఎక్కడైనా మేము ముగ్గురమే ఉంటున్నామని అందరు అనుకున్నారని నిఖిల్ అన్నాడు. మీరేమంటారని హౌస్ మేట్స్ ని అడుగగా.. ఎస్ అని హౌస్ అంతా అన్నారు. యునానిమస్ ఎస్ అని నాగార్జున అన్నాడు. ఈ ప్రోమో చూస్తే నిఖిల్, సోనియాలకి గట్టిగానే క్లాస్ పీకినట్టున్నాడు నాగార్జున.

ఇక హౌస్ లో ఎవరుంటారు.. ఎవరు ఎలిమినేషన్ అవుతారు.. ఎవరు సీక్రెట్ రూమ్ లో ఉంటారు.. అసలు ఈ వారం ఒక్కో కంటెస్టెంట్ పర్ఫామెన్స్ ఎలా ఉందో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.