Read more!

English | Telugu

మళ్లీ 'బిగ్ బాస్'లో మాటల మంటలు! వ‌ర‌స్ట్ ప‌ర్ఫార్మ‌ర్‌గా స‌న్నీ!!

 

తెలుగు 'బిగ్ బాస్' సీజన్ 5లో గట్టిగా అరుచుకోవడం... చిన్న చిన్న విషయాలకు గొడవలు పెట్టుకోవడం వంటి విషయాలు చాలా కామన్ అయ్యింది. మొన్నామధ్య ఒకసారి ఆట పేరుతో మధ్యలో కొట్టుకున్నారు కూడా! అయితే, ఇప్పుడు కొట్లాటలు కొంచెం తగ్గాయి. కానీ, మాటల మంటలు మాత్రం ఎప్పటికప్పుడు రగులుతూ ఉన్నాయి. ఫ్రెండ్స్ కోసం ఈసారి మాటల మంటలు రగిలాయి. 

కెప్టెన్ టాస్క్ గురించి సన్నీ, జెస్సీ మధ్య మొదట గొడవ జరిగింది. జెస్సీ సరిగా పని చేయలేదని సన్నీ ఫైర్ అయ్యాడు. తర్వాత ఇంటిలో సభ్యులు చెప్పినదాని ప్రకారం వరస్ట్ పెర్ఫార్మర్ రేసులో కాజల్, సన్నీకి ఓట్లు సమానంగా పడ్డాయి. అప్పుడు సన్నీ పేరు చెప్పాడు షణ్ముఖ్. సన్నీతో టాస్క్ లో బస్తాను తన్నడం నచ్చలేదని చెప్పాడు. తనతో పాటు చాలామంది హౌస్ మేట్స్ కి నచ్చలేదని అన్నాడు. మిగతావాళ్లు ఎవరో చెప్పమని సన్నీ అడిగాడు. అప్పుడు సిరి హన్మంతు తన చేయి పైకి ఎత్తింది. 

అక్కడ ఫ్రెండ్స్ టాపిక్ వచ్చింది. 'ఆవిడ మీ ఫ్రెండే కదా' అని సన్నీ కామెంట్ చేశాడు. దాంతో సిరి కోప్పడింది. 'ఏంటి... ఇరవై నాలుగు గంటలు మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ అంటారు. మీరు ముగ్గురు ఫ్రెండ్స్ (సన్నీ, కాజల్, మానస్) లేరా? మేము ఎప్పుడైనా అన్నామా?' అని మండిపడింది. దాంతో మానస్ లైనులోకి వచ్చాడు. 'యు ఆర్ క్లియర్లీ డిఫెండింగ్ యువర్ ఫ్రెండ్' అని షణ్ముఖ్ మీద కామెంట్ చేశాడు. అందుకే, తనకు వరస్ట్ పెర్ఫార్మర్ ఇచ్చానని షణ్ముఖ్ అరిచాడు. ఇలా ఒకరిపై మరొకరు అరుచుకున్నారు. చివరకు, సన్నీని వరస్ట్ పెర్ఫార్మర్ అని డిసైడ్ చేసి జైలుకు పంపారు.