English | Telugu

సిగ్గుతో చీరకొంగు వెనుక ముఖం దాచుకున్న అనసూయ!

రష్మీ గౌతమ్‌కి తెలుగు రాదు కనుక డైలాగులు మరచిపోతుంది. మధ్యలో ఏవో పదాలు చేరుస్తుంది. 'అలా కాదు అమ్మా!' అంటూ పక్కన ఉన్నవాళ్లు కరెక్ట్ చేస్తుంటారు. అవలీలగా తెలుగు మాట్లాడే అనసూయ కూడా డైలాగులు మరచిపోతుందా? దీపావళి సందర్భంగా నవంబర్ 4న టెలికాస్ట్ కానున్న జ‌బ‌ర్ద‌స్త్ ఎపిసోడ్ ప్రోమో చూస్తే... అదే డౌట్ వస్తుంది. అక్కినేని నాగార్జున క్లాసిక్ మూవీ 'గీతాంజలి' థీమ్ తీసుకుని 'హైపర్' ఆది స్కిట్ చేశాడు. అందులో అతడు నాగార్జున, అనసూయ హీరోయిన్ గిరిజ‌.

'నీకు కాన్సర్ అని నాకు ఎందుకు చెప్పలేదు?' అని ఆదిని అనసూయ అడుగుతుంది. 'నీది స్కార్పియో అనే సంగతి నాకెందుకు చెప్పలేదు?' అని ఆది ఎదురు ప్రశ్నించాడు. ఇక్కడ స్కార్పియో అంటే కారు కాదు. వృశ్చిక రాశి అన్నమాట. 'నువ్వు రాశిగారి ఫలాల గురించి మాట్లాడుతున్నావా?' అని చాలా సీరియ‌స్‌గా పాత్ర‌లో లీన‌మై అనసూయ డైలాగ్ చెప్పింది. ఛాన్స్ దొరికితే ఆది వదులుతాడా? 'అవి రాశి గారి ఫలాలు కాదు.. రాశి ఫలాలు' అని కరెక్ట్ చేశాడు. అందరూ నవ్వేశారు. సిగ్గుతో చీరకొంగు వెనుక అనసూయ తన ముఖం దాచుకుంది.

అనసూయ సంగతి పక్కన పెడితే... ఆది, వెంకీ మంకీస్ స్కిట్లలో అడల్ట్ జోక్స్ చాలా పేలాయి. 'చలాకి' చంటి స్కిట్ లో సుధాకర్ లేడీ గెటప్ వేసి చిత్ర విచిత్ర వేషాలు వేశాడు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.