English | Telugu
బిగ్ షాక్! జెస్సీని హౌస్ బయటకు పంపేసిన బిగ్ బాస్!!
Updated : Nov 9, 2021
ఆడియెన్స్‌తో పాటు హౌస్‌మేట్స్ అందరికీ బిగ్ బాస్ ఊహించని షాక్ ఇచ్చాడు. అనారోగ్యంతో బాధపడుతున్న జెస్సీని హౌస్ బయటకు పంపాడు. "జస్వంత్ మీ ఆరోగ్య పరిస్థితి ఇంకా మెరుగుపడలేదనే సంగతి మీక్కూడా తెలుసు. అందుకోసం మీరు ఇంటినుంచి బయటకు రావాల్సి ఉంటుంది. మెయిన్‌గేట్ నుంచి బయటకు రండి." అని బిగ్ బాస్ సూచించాడు. కళ్లు నులుముకుంటూ, ఏడుపు ఆపుకుంటూ రూమ్‌లోంచి బయటకు వచ్చిన జెస్సీ, హౌస్‌మేట్స్‌తో "గైస్! నేను హౌస్‌ని వదిలి వెళ్తున్నా" అని అనౌన్స్ చేశాడు. అందరూ షాకైపోయారు. సిరి ఏడుస్తూ జెస్సీని గట్టిగా కౌగిలించుకుంది. జెస్సీ కూడా ఏడుస్తూ "ఐ మిస్ యు రా" అన్నాడు.
రవి.. "జెస్సీ నువ్వు ఫైటర్‌వి. ధైర్యంగా ఉండు" అని భుజం తట్టాడు. ఆ తర్వాత షణ్ణును కావాలించుకున్నాడు జెస్సీ. సిరి తిరిగివచ్చి ఆ ఇద్దర్నీ కౌగలించుకుంది. ముగ్గురూ బాధతో కన్నీళ్లు పెట్టుకున్నారు. సిరి అయితే బిగ్గరగా ఏడ్చేసింది. జెస్సీ మెయిన్ గేట్ దగ్గరకు వెళ్లినప్పుడు పరిగెత్తుకొని వెళ్లి, అతడి నుదుటిపై ముద్దు పెట్టుకుంది. అతడు బయటకు వెళ్లాక కూడా ఏడుస్తూనే ఉంది. జెస్సీ అలా అర్ధంతరంగా వెళ్లిపోవడంతో షణ్ణు, సిరి ఇద్దరూ బాగా హర్టయినట్లు కనిపించారు.
ఈవారం విశ్వ ఎలిమినేషన్‌కు గురై హౌస్ నుంచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు అనారోగ్యంతో జెస్సీ బయటకు వెళ్లిపోయినట్లు చూపించారు. నిజంగానే జెస్సీ హౌస్‌ని వదిలి బయటకు వచ్చేశాడా? లేక ఆడియెన్స్‌లో క్యూరియాసిటీని పెంచడానికి ప్రోమోను అలా కట్ చేశారా? ఈ ప్రశ్నలకు ఈ రోజు ప్రసారమయ్యే ఎపిసోడ్ చూస్తే జవాబులు దొరుకుతాయి.