Read more!

English | Telugu

త‌ల్లి చేతుల మీదుగా అన్‌సేఫ్ అయిన‌ ర‌వి.. నాగ్‌కు అస‌లు హృద‌యం ఉందా?!

 

బిగ్‌ బాస్ సీజ‌న్‌ 5 ఎండింగ్‌కి ఇంకా కొన్ని రోజులు మాత్ర‌మే వుండ‌టంతో అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అంతే కాకుండా ఈ ఆదివారం ఎలిమినేష‌న్ డే కావ‌డం.. శ‌నివారం స‌న్నీ, సిరి, శ్రీ‌రామ‌చంద్ర సేఫ్ కావ‌డంతో ఈ రోజు హౌస్ నుంచి బ‌య‌టికి వ‌చ్చేది ఇత‌నే అంటూ ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. హౌస్‌లోకి 19 మంది కంటెస్టెంట్‌లు వ‌స్తే అందులో 11 మంది ఎలిమినేట్ అయి ఇంటిదారి ప‌ట్టారు.

మిగిలిన ఎనిమిది మంది యాంక‌ర్ ర‌వి, స‌న్నీ, శ్రీ‌రామ‌చంద్ర‌, సిరి, కాజ‌ల్‌, మాన‌స్‌, ప్రియాంక‌, ష‌ణ్ముఖ్ వున్నారు. ఇందులో శ‌నివారం స‌న్నీ, సిరి, శ్రీ‌రామ‌చంద్ర సేఫ్ అయ్యారు. ఇక మిగిలింది యాంక‌ర్ ర‌వి, ష‌ణ్ముఖ్‌, ప్రియాంక‌, కాజ‌ల్‌, మాన‌స్‌, శ‌నివారం యాంక‌ర్ ర‌వి త‌ల్లితో పాటు శివ‌బాలాజీ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా యాంక‌ర్ ర‌వి గురించి మాట్లాడిన శివబాలాజీ "నువ్వు చాలా మంచోడివి. నువ్వు నీకోసం పుట్టావ్‌.. బ‌య‌ట వుండ‌టం వేరు బిగ్‌బాస్ హౌస్‌లో వుండ‌టం వేరు.. నువ్వు ఎప్పుడూ ఎదుటివాళ్లకు స‌పోర్ట్‌గా మాట్లాడొద్దు. నీ ఒపీనియ‌న్ చెప్పి వ‌చ్చేయ్" అన్నాడు.

Also read:  బిగ్‌బాస్‌: ష‌న్నుకు కింగ్ నాగ్ స్ట్రాంగ్ వార్నింగ్‌

అంతే కాకుండా నువ్వు మెచ్యూర్డ్ పర్స‌న్‌వ‌ని చెప్పుకొచ్చాడు. ఇక ఇదే సంద‌ర్భంగా యాంక‌ర్ ర‌వి త‌ల్లికి ఓ క‌వ‌ర్ ఇచ్చి అందులో నుంచి ఓ క‌వ‌ర్ తీయ‌మ‌న్నాడు నాగార్జున‌. క‌వ‌ర్ చించి చూస్తే అందులో ర‌వి అన్‌సేఫ్ అని వుంది. దీంతో హౌస్‌మేట్స్‌తో పాటు వీక్ష‌కులు కూడా షాక‌య్యారు. త‌ల్లి చేతుల మీదుగా కొడుకుని అన్‌సేఫ్ చేయ‌డం ఏమీ బాగాలేద‌ని నెటిజ‌న్స్ బిగ్‌బాస్‌పై సెల‌టైర్లు వేస్తున్నారు. చివ‌ర‌కు అదే నిజ‌మై, బిగ్‌బాస్ హౌస్ నుంచి ర‌వి ఎలిమినేట్ అయ్యాడు. ఇది చూసిన‌ యాంక‌ర్ ర‌వి ఫ్యాన్స్ షాక్‌కు గుర‌వుతున్నారు. ర‌వి ఎలా ఎలిమినేట్ అయ్యాడో లెక్క చూపించ‌మ‌ని డిమాండ్ చేస్తున్నారు.