English | Telugu

బిగ్ బాస్ త‌మిళ్ 5: క‌మ‌ల్ ప్లేస్‌లో ర‌మ్య‌కృష్ణ వ‌చ్చేశారు!

బిగ్ బాస్ త‌మిళ్ 5 హోస్ట్ అయిన క‌మ‌ల్ హాస‌న్‌కు క‌రోనా పాజిటివ్ అని నిర్ధార‌ణ అయి, హాస్పిట‌ల్‌లో చేర‌డంతో వీకెండ్ ఎపిసోడ్‌కు ఆయ‌న స్థానంలో ప్ర‌ముఖ సీనియ‌ర్ యాక్ట్రెస్ ర‌మ్య‌కృష్ణ వ‌చ్చారు. క‌మ‌ల్ హౌస్‌మేట్స్‌తో వీడియో కాల్ ద్వారా ఇంట‌రాక్ట్ అవుతున్న వీడియో క్లిప్‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన మేక‌ర్స్‌, ఆయ‌న కోలుకొని తిరిగి వ‌చ్చేంత‌వ‌ర‌కు ర‌మ్య‌కృష్ణ హోస్ట్‌గా కొన‌సాగుతారంటూ ఆమెను ప‌రిచ‌యం చేశారు.

ఈ న్యూస్‌ను అనౌన్స్ చేసేందుకు మేక‌ర్స్ ఒక ప్రోమో వీడియోను షేర్ చేశారు. గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన ర‌మ్య‌కృష్ణ గోల్డ్ క‌ల‌ర్ చీర‌లో బ్యూటిఫుల్‌గా క‌నిపిస్తున్నారు. బిగ్ బాస్ ఫ్యాన్స్ సైతం ర‌మ్య‌కృష్ణ ఈ షోను ఎలా హోస్ట్ చేస్తారో చూడాల‌ని ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే ఆమె బిగ్ బాస్ సెట్స్‌పైకి రావ‌డం ఇదే మొద‌టిసారి కాదు. ఇదివ‌ర‌కు బిగ్ బాస్ తెలుగు 4 వీకెండ్ ఎపిసోడ్‌కు నాగార్జున ప్లేస్‌లో ఆమె హోస్ట్‌గా చేసి, అంద‌ర్నీ ఆక‌ట్టుకున్నారు.

బిగ్ బాస్ త‌మిళ్ 5లో కొన్ని ఇంట్రెస్టింగ్ వైల్డ్‌కార్డ్ ఎంట్రీలు క‌నిపిస్తున్నాయి. ఇంత‌కుముదు షో నుంచి ఎలిమినేట్ అయిన అభిషేక్ రాజా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా మ‌రోసారి హౌస్‌లోకి వ‌చ్చాడు. అలాగే హీరో విజ‌య్ స‌న్నిహితుడు సంజీవ్ కూడా ఈ వారం షోలో ఎంట్రీ ఇచ్చాడు.

Also read: `బంగార్రాజు`పైనే `శివ‌గామి` ఆశ‌లు!

కాగా, ఇటీవ‌ల యు.ఎస్‌.కు వెళ్లి తిరిగొచ్చిన క‌మ‌ల్ హాస‌న్‌కు క‌రోనా పాజిటివ్ అని తేలడంతో చెన్నైలో శ్రీ‌రామ‌చంద్ర హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయ‌న కోలుకొనేవ‌ర‌కు కుమార్తెలు శ్రుతి, అక్ష‌ర‌, శ్రుతి బాయ్‌ఫ్రెండ్ శంత‌ను హ‌జారికా చెన్నైలోనే ఉండ‌నున్నారు. త‌మ తండ్రి కోలుకుంటున్నార‌నీ, ఆయ‌న ఆరోగ్యం గురించి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌నీ శ్రుతి చెప్పారు.

Also read: ష‌ణ్ణుతో హ‌గ్గుల‌పై సిరి ప్రియుడి షాకింగ్ రియాక్ష‌న్‌!

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.