English | Telugu

ఇండియా-న్యూజిల్యాండ్ మ్యాచ్‌ vs బిగ్ బాస్ స్పెష‌ల్‌ ఎపిసోడ్‌!

ప్రతి వీకెండ్ 'బిగ్ బాస్'లో కింగ్ నాగార్జున సందడి చేస్తారు. దాంతో ఆడియన్ అందరూ వీకెండ్ ఎపిసోడ్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఈ‌ ఆదివారం మాత్రం నాగార్జునకు తోడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ, అతని తమ్ముడు ఆనంద్ దేవరకొండ... స్టార్ యాంకర్ సుమ... సెక్సీ హీరోయిన్ శ్రియ శరణ్... డాన్స్ పెర్ఫార్మెన్స్ తో అవికా గోర్... హీరో హీరోయిన్లు సంతోష్ శోభన్, మెహరీన్ కౌర్ సందడి చేశారు. వీళ్ళకి తోడు గత సీజన్ బిగ్ బాస్ సభ్యులు సొహైల్‌, అరియానా, అవినాష్, బాబా భాస్కర్ మాస్టర్ తదితరులు షోకి వచ్చారు.

దీపావళి ఈ వారమే. అయితే... ఆ‌ రోజు‌ ఎపిసోడ్‌కి నాగార్జున రారు.‌ అందుకని ఈ ఆదివారమే దీపావళి స్పెషల్ ఎపిసోడ్ డిజైన్ చేశారు. దీని వెనుక మరో కారణం కూడా ఉంది... ఆదివారం న్యూజిలాండ్, భారత్ మధ్య టి20 వరల్డ్ కప్ మ్యాచ్ ఉంది.‌ టీమిండియా ఎట్టి పరిస్థితులలోనూ ‌విజయం సాధించాల్సిన మ్యాచ్‌ ఇది. అందుకని, తెలుగు ప్రేక్షకులు కూడా ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూశారు.

మ్యాచ్ నుండి ప్రేక్షకుల దృష్టి షో వైపు తిప్పుకోవాలని అంటే సాధారణంగా ఉంటే సరిపోదు. సంథింగ్ స్పెషల్ అన్నట్టు ఉండాలి. టీఆర్పీలు పడిపోకుండా చూసుకోవాలి. అందుకని దీపావళిని బిగ్ బాస్ ఫుల్‌గా వాడేశాడు. దీపావళికి విడుదల అవుతున్న సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి ఆయా యూనిట్ సభ్యులకు బిగ్ బాస్ వేదిక కల్పించింది. దాంతో హీరో హీరోయిన్ల వచ్చారు. క్రికెట్ vs బిగ్ బాస్... ఈ పోరులో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.