English | Telugu

టీడీపీ ప‌గ్గాలు చంద్ర‌బాబుకు ఎందుకిచ్చావ్‌? బాల‌య్య‌కు మోహ‌న్‌బాబు సూటి ప్ర‌శ్న‌!

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావుకు తగ్గ తనయుడిగా ఇటు సినిమాల్లోనూ, అటు రాజకీయాల్లోనూ సింహం నందమూరి బాలకృష్ణ పేరు తెచ్చుకున్నారు. హీరోగా ఆయనది ఎప్పుడూ టాప్ ప్లేస్. రాజకీయాల్లోనూ ఎమ్మెల్యేగా రాణిస్తున్నారు. తండ్రి స్థాపించిన తెలుగుదేశం పార్టీ పగ్గాలను అందుకోవాలనే ఆశ తనకు ఉన్నట్లు ఎప్పుడు బాలకృష్ణ చెప్పలేదు. బావ నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో నడుస్తున్న పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారు. అయితే... 'తెలుగుదేశం పార్టీ పగ్గాలు చంద్రబాబుకి ఎందుకిచ్చావ్?' అని బాలకృష్ణను మోహన్ బాబు ప్రశ్నించారు.

బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న టాక్ షో 'అన్ స్టాపబుల్' ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో ఆదివారం విడుదల అయింది. ఈ షోకి మోహన్ బాబు తొలి అతిధిగా వచ్చారు. ఆయనతో బాలకృష్ణ ఇంటర్వ్యూ సరదాగా మొదలైంది. మధ్యలో తెలుగుదేశం పార్టీ విషయం వచ్చినప్పుడు ఇద్దరిమధ్య మాటా మాటా పెరిగింది. "చంద్రబాబుకు పార్టీ పగ్గాలు ఎందుకు ఇచ్చావు?" అని మోహన్ బాబు ప్రశ్నించిన తర్వాత... "ఆయన్ను అన్నగారు (ఎన్టీఆర్) స్థాపించిన పార్టీలో నుంచి వెళ్ళిపోయి వేరే పార్టీలో ఎందుకు చేరాల్సి వచ్చింద"ని బాలకృష్ణ అడిగారు.

ప్రోమో మొత్తం మీద సగటు సినిమా అభిమానులతో పాటు సామాన్యులను సైతం ఆకట్టుకున్న అంశం ఏదైనా ఉందంటే అది ఇదే. దీపావళి కానుకగా విడుదల కానున్న ఫుల్ ఎపిసోడ్ లో టాపిక్ మీద ఇంకేం మాట్లాడారో చూడాలనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.