Read more!

English | Telugu

ప్రియాంక‌కు బిగ్‌బాస్ స్ట్రాంగ్ వార్నింగ్‌!

బిగ్‌బాస్ సీజ‌న్ 5 12 వారాలు పూర్తి చేసుకుని 13వ వారంలోకి అడుగుపెట్టింది. ఈ ఆదివారం యాంక‌ర్ ర‌వి ఎలిమినేట్ అయిన విష‌యం తెలిసిందే. దీంతో హౌస్‌లో కొంత గంద‌ర‌గోళ వాతావ‌ర‌ణం నెల‌కొన్నా 13వ వారం ఎలిమినేష‌న్ కోసం నామినేష‌న్ ప్ర‌క్రియ‌ని ప్రారంభించేశారు. సోమ‌వారం ఇందు కోసం ప‌లు నాట‌కీయ ప‌రిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. ఈ నేప‌థ్యంలో బిగ్‌బాస్ ప్రియాంక‌కు వార్నింగ్ ఇవ్వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

సోమ‌వారం నామినేష‌న్ ప్రిక్రియ‌కు సంబంధించిన ప్రోమోని నిర్వాహ‌కులు తాజాగా విడుద‌ల చేశారు. ర‌వి ఎలిమినేట్ కావ‌డంతో హౌస్‌లో మొత్తం 7 స‌భ్యులున్నారు. ఈ వారం ఇంటి కెప్టెన్ కావ‌డంతో ష‌న్ముఖ్ నామినేష‌న్స్ నుంచి త‌ప్పించుకున్నారు. దీంతో మిగ‌త ఆరుగురు ప్రియాంక‌, సిరి, మాన‌స్‌, శ్రీ‌రామ‌చంద్ర‌, స‌న్నీ, కాజ‌ల్ లు నామినేష‌న్స్‌లో వున్నారు. ఈ నామినేషన్స్ ప్రిక్రియ కోసం బిగ్‌బాస్ ప్ర‌తి ఇంటి స‌భ్యుల ముందు వారి ముఖంతో బాల్స్ వున్నాయ‌ని, మీరు నామినేట్ చేస్తున్న స‌భ్యుల ముఖం వున్న‌ బాల్‌ని తీసుకుని ఇంటి గేటు బ‌య‌టికి వెళ్లేలా త‌న్నాల్సి వుంటుంద‌ని టాస్క్ ఇచ్చారు.

ఈ ప్ర‌క్రియ‌లో స‌న్నీ, శ్రీ‌రామ‌చంద్ర మ‌ధ్య వాద‌న జ‌రిగింది. ఆ త‌రువాత లైన్‌లోకి వ‌చ్చిన ప్రియాంక త‌న‌కు మాత్రం టైమ్ కావాల‌ని, నాకు నిజంగానే ఎవ‌రిని నామినేట్ చేయాల‌నే విష‌యంలో పాయింట్స్ లేవ‌ని చెప్పింది. దానికి సంచాల‌క్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ష‌న్ను అభ్యంత‌రం చెప్పాడు. పాయింట్స్ లేవు అంటే అవ్వ‌దు. ఇప్పుడైనా చెప్పాలి క‌దా ` అన్నాడు. నేను హ‌ర్ట్ అయ్యింది నీవ‌ల్ల‌నే నువ్వు నామినేష‌న్స్‌లో వుంటే నిన్నే నామినేట్ చేసేదాన్ని` అంటూ ష‌న్నుకు కౌంట‌ర్ ఇచ్చింది ప్రియాంక‌. ఇలా వాద‌న జ‌రుగుతుండ‌గానే బిగ్‌బాస్ ప్రియాంక మీమ్మ‌ల్ని చివరి సారి హెచ్చ‌రిస్తున్నాను. మీరు మీ నామినేష‌న్స్‌ని తెల‌ప‌న‌ట్ట‌యితే మీరే నేరుగా నామినేట్ అవుతారు` అని ప్రియాంక‌కు బిగ్‌బాస్ షాకిచ్చారు. ఈ ప్రోమో ప్ర‌స్తుతం నెట్టింట సంద‌డి చేస్తోంది.