English | Telugu

Tanuja vs Immanuel: తనూజ మాటలకు కన్నీళ్ళు పెట్టుకున్న ఇమ్మాన్యుయల్!


బిగ్ బాస్ సీజన్-9 లో పదమూడవ వారం నామినేషన్లో కంటెస్టెంట్స్ మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి. వారిలో డీమాన్ పవన్ వర్సెస్ సుమన్ శెట్టి నామినేషన్ నెక్స్ట్ లెవెల్ నామినేషన్ అవ్వగా భరణి వర్సెస్‌ తనూజ నామినేషన్ సెన్సిటివ్ టాపిక్ గా మారింది.

ఇక రీతూ వర్సెస్ సంజన మధ్య గత వారం జరిగిన హీటెడ్ ఆర్గుమెంట్స్ తాలుకా సెగ ఇంకా కొనసాగుతూనే ఉంది. రీతూ క్షమాపణ చెప్తుందేమోనని వెయిట్ చేశా కానీ అది నీ దగ్గర రాలేదని సంజన తన నామినేషన్ పాయింట్ చెప్పింది. ఇక ఇద్దరు ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు. ఇక తనూజని ఇమ్మాన్యుయల్ నామినేషన్ చేయగా రివేంజ్ నామినేషన్ గా ఇమ్మాన్యుయల్ ని తనూజ నామినేట్ చేద్దామని తన పాయింట్లు చెప్పింది. బిగ్ బాస్ కి రాకముందు ఇమ్మాన్యుయల్ తప్ప నాకు ఎవరు తెలియదు.. నేను ఎలా ఆడుతానో ఏమోనని భయంగా ఉందని బయట అంటే ఎందుకురా భయం నేనుబ్నా కదరా అని ఇమ్మాన్యుయల్ అన్నాడు. ఆ ధైర్యంతోనే హౌస్ లోకి వచ్చిన నాటి నుండి నాకు ఏదనిపిస్తే అది వాడితో షేర్ చేసుకునేదాన్ని అంటు తనూజ ఏడ్చేసింది. ఒకవేళ వాడితో గొడవ జరిగితే భరణి గారితో షేర్ చేసుకునేదాన్ని అని తనూజ ఏడ్చేసింది.

నాకు ఎవరితో ఇష్యూ ఉన్నా వాడితోనే షేర్ చేసుకునేదాన్ని ఎందుకంటే వాడు నా ఫ్రెండ్.. కానీ దాన్ని కూడా నామినేషన్లో పెట్టావు. నా మీద ‌నీకు కోపం ఉన్నా.. ఏం అయినా అనిపించినా నా‌ మొఖం మీద చెప్పు.. కరెక్ట్ చేసుకుంటా లేదంటే తర్వాత అయినా చెప్పు మార్చుకుంటానని తనూజ ఎమోషనల్ అయింది. ఇక ఇమ్మాన్యుయల్ తన పాయింట్లు చెప్పుకొచ్చాడు‌. నువ్వు ఎలాగైతే ఫీల్ అయ్యావో నేను అలాగే ఫీల్ అయ్యాను. నాకు నీకన్నా రీతూ ఆర్నెళ్ళు పరిచయం కానీ తనతో హౌస్ లో ఎప్పుడు క్లోజ్ గా లేను. మొదటి మూడు వారాలు తనూజని నేను ఎప్పుడు వదిలిపెట్టలేదు. నా విషయంలో నువ్వు ఎంత ట్రూ గా ఉన్నావో.. నీ విషయంలో నేను అంతే ట్రూ గా ఉన్నానని ఇమ్మాన్యుయల్ ఎమోషనల్ అయ్యాడు. నాన్న తప్ప నాకు ఎవరు సపోర్ట్ చేయలేదని నువ్వు ఎప్పుడైతే అన్నావో..‌ అప్పుడే బాధపడ్డాను.. ఇంత సపోర్ట్ గా నిలిచినా నువ్వు ఇలా అనేసరికి నాకేం చేయాలో అర్థం కాలేదు. తనూజ నువ్వు ఏమైనా అంటే దాని నుంచి నాకు బయటికి రావడానికి టైమ్ పడుతుంది తనూజ.. మనిద్దరికి గొడవలు వద్దనే చెప్పాను నేను. అప్పుడు నువ్వేమన్నావంటే.. నువ్వు నా ఫ్రెండే కాదురా అని నా మొఖం మీద చెప్పావ్.. అప్పుడే నా మనసు విరిగిపోయిందని ఇమ్మాన్యుయల్ ఏడ్చేశాడు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.