English | Telugu

Suman Shetty : నీకు దెబ్బ తగిలింది కదా హౌస్ లో నుండి వెళ్ళిపో పవన్.. ది బెస్ట్ నామినేషన్ ఇదే!


బిగ్ బాస్ సీజన్-9 లో సోమవారం నామినేషన్ల ప్రక్రియ ఫుల్ ఆసక్తికరంగా సాగింది. కానీ సుమన్ శెట్టి చేసిన నామినేషన్ నెక్స్ట్ లెవెల్ అంతే. అంతగా హౌస్ మేట్స్ ఎప్పుడు నవ్వలేదు. నిన్నటి ఎపిసోడ్ లో సుమన్ శెట్టి తన మొదటి నామినేషన్ గా రీతూని చేశాడు. ఆ వివరాలు ఓసారి చూసేద్దాం.

రీతూ నువ్వు హౌస్‌లో గట్టిగట్టిగా అరుస్తావ్.. నాకు అది ఇబ్బందిగా ఉందని సుమన్ శెట్టి తన పాయింట్ చెప్పాడు. నేను, మీరు ఒకేలా మాట్లాడం కదా అన్నా.. దానికి నేనేం చేయాలి.. మిగిలిన వాళ్లకి కూడా ఇబ్బంది అయితే వాళ్లు చెప్పుండేవాళ్లు కదా అని రీతూ అడుగుతుంది. వాళ్ళకి భయమేమో చెప్పలేదు కానీ నాకు భయం లేదు అందుకే చెప్తున్నానని సుమన్ శెట్టి అన్నాడు. ఇక ఆ తర్వాత డీమాన్ పవన్ ని నామినేట్ చేశాడు సుమన్ శెట్టి. ఇక తన కారణం చెప్పాడు. నీకు దెబ్బ తగిలింది కదా పవన్.. నువ్వు ఇంటికెళ్లిపోయి రెస్ట్ తీసుకోమని సుమన్ అనగానే డీమాన్ తో పాటు హౌస్ అంతా ఫుల్ నవ్వుకున్నారు.

నువ్వు స్ట్రాంగ్ కంటెస్టెంట్ వి కానీ నీకు రెస్ట్ అవసరం ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోమని సుమన్ శెట్టి అంటాడు. అదేంటన్నా స్ట్రాంగ్ అంటే ఉండాలి కదా అని డీమాన్ అన్నాడు. నీకు హెల్త్ బాలేదు కదా వెళ్ళిపోమని సుమన్ శెట్టి అనగానే కళ్యాణ్, ఇమ్మాన్యుయల్ అయితే పగలబడి నవ్వుకున్నారు. భరణి, తనూజ అయితే నవ్వలేక మొహం కప్పేసుకున్నారు. సుమన్ శెట్టి చేసిన ఈ నామినేషన్ తో హౌస్ అంతా ఫుల్ హ్యాపీగా నవ్వుకున్నారు. ది బెస్ట్ నామినేషన్ గా సుమన్ శెట్టి నామినేషన్ నిలిచిపోతుంది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.