English | Telugu

Bigg Boss 9 Telugu Sanjana, Emmanuel: జ్ఞాపకాలు షేర్ చేసుకున్న ఇమ్మాన్యుయేల్, సంజన.. ఎమోషనల్ ఎపిసోడ్!

ఈ సీజన్ గ్రాంఢ్ ఫినాలేకి అయిదు రోజులు మాత్రమే ఉంది. హౌస్ లో ఉన్న టాప్-5 ని వాళ్ళకి ఈ సీజన్ గురించి వాళ్ళ మూమెంట్స్ షేర్ చేసుకోమని బిగ్ బాస్ చెప్పాడు. మొదటగా ఇమ్మాన్యుయేల్ తన గురించి చెప్పాడు. నేను ఇక్కడికి రాకముందు షోస్ తో బిజీగా ఉండేవాడిని.. ఒక టీమ్ ని లీడ్ చేసాను. నాకు ఈ సీజన్ కి బిగ్ బాస్ నుండి కాల్ వచ్చింది.

ఇదంతా వదులుకొని వెళ్లాలా అసలు పరిస్థితి ఏంటని అందరి ఒపీనియన్ తీసుకున్నాను.. ఇక్కడికి వచ్చాను.. చాలా నేర్చుకున్నాను.. కామెడీ చెయ్యాలి.. అందరిని ఎంటర్టైన్ చెయ్యాలనుకున్నాను కానీ ఫస్ట్ వీక్ లోనే హరిష్ తో గొడవ అయింది. అది నేను తీసుకోలేకపోయాను బాడీ షేమింగ్ అన్నారు. నాకు నా గర్ల్ ఫ్రెండ్ చెప్పింది. ఏం కామెడీ చేసిన నీకు నీ మీద చేసుకో అందరు తీసుకోలేరని చెప్పి పంపించింది. ఫస్ట్ వీక్ గొడవ ఇక సెకండ్ వీక్ లో మా మమ్మీ దొరికింది. అప్పటి నుండి చాలా బాగుంది. మా కామెడీ టైమింగ్ ఫన్ వేలో వెళ్ళిందని ఇమ్మాన్యుయేల్ చెప్పాడు.

మనకు ఎంత డబ్బులున్నా.. మన పేరెంట్స్ దగ్గరికి సంవత్సరానికి ఒక్కసారి కాకుండా నెలకో, టూ వీక్స్ కి అలా వెళ్తూ ఉండాలని ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్ అవుతాడు. ఆ తర్వాత సంజన చెప్తుంది. మొదట ఛాన్స్ వచ్చినప్పుడు నా పిల్లల మొహం చూసాను.. నేను ఇన్ని డేస్ ఉంటాననుకోలేదు. నా వేలో యునిక్ గా ట్రై చేసాను. అది జనాలకి ఎలా వెళ్ళిందని తెలియదు. నాకు కొడుకు దొరికాడు. ఇంత పెద్దకొడుకు ఉన్నాడని చెప్పుకోవడానికి సిగ్గుపడనని సంజన చెప్పింది. ఇమ్మాన్యుయేల్, సంజనల బాండింగ్ అంత బాగుంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.