English | Telugu

Bigg Boss 9 Telugu Tanuja : నాకు తనూజతో లైఫ్ లాంగ్ ఉండాలని ఉంది : కళ్యాణ్ పడాల!


బిగ్ బాస్ హౌస్ లో ఇన్నిరోజుల ప్రయాణంలో ఉన్న కంటెస్టెంట్స్ తమ మెమరీస్(జ్ఞాపకాలు) ని షేర్ చేసుకుంటున్నారు. డీమాన్ తన గురించి చెప్పాడు. నాకు బయట సిచువేషన్ బాగోలేదు నాన్నకి అప్పుడ్ ఆపరేషన్ అయింది. ఖర్చులకి అన్నయ్యని డబ్బులు అడిగేవాడిని.. స్పోర్ట్స్ అంటే బాగా ఇష్టం. నా ఖర్చుల కోసం స్కూల్ లో పీటీగా చేశాను.. మా అన్నయ్య బిగ్ బాస్ లో కామనర్స్ కి ఛాన్స్ అని చెప్పాడు. అప్లై చేశాను. ఇప్పుడు ఇక్కడ మీ ముందున్నానని డీమాన్ చెప్పాడు.


ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పడాల తన మెమరీస్ ని షేర్ చేసుకున్నాడు. బిగ్ బాస్ కష్టంగా ఉన్నా చెయ్యాలనిపించే ఇష్టం. ఇక్కడ చాలా ప్రాబ్లమ్ ఉంటుంది.‌ ఫుడ్ సరిగ్గా ఉండదు నిద్రసరిగ్గా ఉండదు అయిన మనకి ఇది కావాలి.. చేస్తాం... నేను అప్లై చేసాను ఛాన్స్ వస్తుందని అనుకోలేదు.. ఇక్కడికి వచ్చాక ఇమ్మాన్యుయేల్ అన్న దొరికాడు. ఆ తర్వాత తనూజ తన వెర్షన్ కాకుండా ఎదుటివాళ్ళ వెర్షన్ కూడా ముందే గెస్ చేసి చెప్తుంది. తనతో లైఫ్ లాంగ్ ఉండాలని ఉంది. ఈ బాండింగ్ ఇలాగే ఉండాలి మోర్ దెన్ ఫ్రెండ్ అని తనూజ గురించి కళ్యాణ్ చెప్తాడు.


ఆ తర్వాత తనూజ తన మెమరీస్ షేర్ చేసుకుంటుంది. మా నాన్నకి నేను ఇలా ఇండస్ట్రీకీ రావడం ఇష్టం లేదు అయిన వచ్చాను.. నేను తెలుగు ప్రజల సపోర్ట్ తోనే ఇక్కడ ఉన్నాను. నేను అందరితో కలిసి ఉండడం నేర్చుకున్నాను.. బయటకు వెళ్లాక కూడా ఇలాగే ఉంటాను. నేను లేడీ బిగ్ బాస్ విన్నర్ అవుతానని తనూజ చెప్తుంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.