English | Telugu

Bigg Boss 9 Ninth week Voting : సాయి శ్రీనివాస్ ఎలిమినేషన్ కన్ఫమ్.. తనూజని నామినేట్ చెయ్యడమే కారణమా!

బిగ్ బాస్ సీజన్-9 తొమ్మిదో వారం కంటెస్టెంట్స్ మధ్య కెప్టెన్సీ రేస్ కోసం టాస్క్ జరుగుతున్నాయి. ఇక తొమ్మిదోవారం నామినేషన్స్‌లో మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. తనూజ, కళ్యాణ్, సుమన్ శెట్టి, సంజన, భరణి, రాము, సాయి శ్రీనివాస్ ఈ ఏడుగురు నామినేషన్స్‌లో ఉన్నారు. ఇక వీరిలో ఎవరు ఎలిమినేషన్ అవుతారో.. ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారో ఓసారి చూసేద్దాం.

తనూజ ఎప్పటిలాగే మొదటి స్థానంలో ఉంది. ముప్పై రెండు శాతంతో మొదటి స్థానంలో ఉండగా, కళ్యాణ్ పడాల ఇరవై ఒక్క శాతంతో రెండో స్థానంలో ఉన్నాడు. సుమన్ శెట్టి పద్నాలుగు శాతంతో మూడో స్థానంలో ఉన్నాడు. భరణి పదకొండు శాతం ఓటింగ్ తో నాలుగో స్థానంలో ఉన్నాడు. సంజన గల్రానీ పది శాతం ఓటింగ్ తో అయిదో స్థానం లో ఉంది. రాము రాథోడ్ ఎనిమిది శాతం ఓటింగ్ తో ఆరో స్థానంలో ఉన్నాడు. ఇక చివరగా నాలుగు శాతం ఓటింగ్ తో సాయి శ్రీనివాస్ చివరి స్థానంలో ఉన్నాడు. ‌దీన్ని బట్టి చూస్తే సాయి శ్రీనివాస్ ఈ వారం ఎలిమినేషన్ ఫిక్స్. ఎందుకంటే అసలు అతనికి ఓటింగ్ పడటం లేదు.

సాయి శ్రీనివాస్‌ ఎలిమినేషన్‌కి మెయిన్ రీజన్ అంటే.. అతను తొలిసారి నామినేషన్స్‌లోకి వచ్చాడు. బయట ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. పీఆర్ నెట్ వర్క్ లేదు. గత వారమే నామినేషన్‌లోకి రావాల్సి ఉండగా.. తన దగ్గర ఉన్న స్పెషల్ పవర్‌తో సేవ్ అయ్యాడు. ప్రత్యేకించి.. ఇతనిపై పెద్దగా కంప్లైంట్స్ ఏం లేవు. ఉన్నంతవరకూ ఫెయిర్‌గానే ఉన్నాడు. తొండి ఆటలు ఆడలేదు. అడ్డమైన వాదనకి దిగలేదు. ఫుటేజ్ ఇవ్వడం కోసం కక్కుర్తి పడలేదు. బయట పీఆర్ టీం స్ట్రాటజీలు చేయలేదు. ఉన్న విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్తాడు. బయట ఐదు వారాలు ఆట చూసి.. ఎవరి స్ట్రాంగో అని తెలిసి కూడా.. వాళ్లతో బాడింగ్‌లు పెట్టుకుని అడ్డదారిలో హౌస్‌లో ఉండే కక్కుర్తి పనులు చేయలేదు. దానితో పాటుగా తనూజని నామినేట్ చేశాడు.‌ బిగ్ బాస్ తన దత్తపుత్రికగా భావించే తనూజని నామినేట్ చేస్తే చూస్తూ ఊరుకుంటాడా ఎలిమినేషన్ చేస్తాడుగా.. ఇంకా దీనికి తోడు ఆడియన్స్ ఓటింగ్ వేయడం లేదు కాబట్టి ఈ వారం ఎలిమినేషన్ అయ్యేది సాయి శ్రీనివాస్. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.