English | Telugu

Bigg Boss 9 Telugu: రెబల్స్ గా సుమన్ శెట్టి, దివ్య ప్రభంజనం.. హౌస్ మేట్స్ ని పిచ్చోళ్ళు చేశారుగా!

బిగ్ బాస్ సీజన్-9 లో సుమన్ శెట్టి, దివ్యల ప్రభంజనం సాగుతోంది. నిన్నటి ఎపిసోడ్ లో వీళ్ళ ఆటతీరుకి జనాలంతా పిచ్చోళ్ళు అయిపోయారు. అసలు ఏం అయిందో ఓ సారి చూసేద్దాం.

బిగ్‌బాస్ హౌస్‌ మొత్తానికి టీ లేకుండా పాల ప్యాకెట్లన్నీ కొట్టేశాడు రెబల్ సుమన్ శెట్టి. అర్ధరాత్రి చేసిన ఈ దొంగతనంతో తెల్లారేసరికి ఎవరికీ టీ చుక్క కూడా లేకుండా పోయింది. అయితే ఉదయం కాగానే రేషన్ మేనేజర్ అయిన రీతూ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూసేసరికి పాల ప్యాకెట్లు కనిపించలేదు. దీంతో రీతూ చౌదరి రేయ్ పాలు ఎవరో కొట్టేశారంటూ హడావిడి చేసింది. మిగిలిన హౌస్‌మేట్స్ అంతా ముందు సంజనని అనుమానించారు కానీ చివరికి కాదని తెలుసుకున్నారు. అయితే రాత్రి పాలు కొట్టేసిన సుమన్ , దివ్య మాత్రం మాములు యాక్టింగ్ చేయలేదు. పాలు ఎవరు కొట్టేసినా ప్లీజ్ ఇచ్చేయండి అంటూ దివ్య మహానటిలా యాక్ట్ చేసింది. సుమన్ శెట్టి అయితే అమాయకుడిలా ఫేస్ పెట్టి అందరిని బోల్తా కొట్టించేశాడు. ఇక రేషన్ మేనేజర్ అయిన రీతూ మీద కూడా కొంతమందికి డౌట్ వచ్చింది. కానీ ఎవరూ అసలు రెబల్ ఎవరనేది మాత్రం కనిపెట్టలేకపోయారు. అయితే రెండో టాస్క్ విజయవంతంగా పూర్తి చేయడంతో కెప్టెన్సీ కంటెండర్‌షిప్ రేసు నుంచి మరొకరిని తప్పించే ఛాన్స్ రెబల్స్ అయిన దివ్య, సుమన్ శెట్టికి దక్కింది.

పాల ప్యాకెట్లు లేకపోయేసరికి ఎవరికీ బుర్ర పని చేయలేదు. రేషన్ మేనేజర్ అయిన రీతూయే రెబల్ అయి ఉండొచ్చని తనూజ అనుకుంది. అయితే దివ్య ఓవరాక్షన్ చూసి నువ్వే రెబల్ ఎందుకు కాకూడదంటూ రాము కామెడీగా గెస్ చేశాడు. కానీ నిఖిల్ మాత్రం దివ్యనే రెబల్ అని కరెక్ట్‌గా గెస్ చేశాడు. రాత్రి నేను అప్పుడప్పుడూ లేచాను ఆ సమయంలో దివ్య పడుకోలేదు.. బయట తిరగడం చూశాను ఆమె రెబల్ అయి ఉంటుందని నిఖిల్ అన్నాడు. అదే టాకు.. క్యూట్ ఫేస్ పెట్టుకొని ఆడుతుందని భరణి కూడా అన్నాడు. ఇక పాలు ఖచ్చితంగా ఎవరు తాగినా బాటిల్‌లో పోసుకొనే తాగుంటారని రీతూ అనుకుంది. వెంటనే అందరి బాటిల్స్ తీసుకొచ్చి స్మెల్ చూడటం స్టార్ట్ చేసింది. అయితే ఎక్కడ దొరికిపోతుందోనని భావించిన దివ్య.. అప్పటికప్పుడు మాస్టర్ ప్లాన్ వేసింది. మద్యాహ్న భోజనానికి వెజిటబుల్స్ కట్ చేయమని గౌరవ్ కు దివ్య చెప్పగా.. రీతూ రేషన్ మేనేజర్ గా ఆర్డర్ వేసింది‌‌. ఇక ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ‌

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.