English | Telugu

Bigg Boss 9 Telugu Family Week: మాకు ఫైర్ భరణి కావాలి.... కమాండ్ చేసేవాళ్లతో జాగ్రత్తగా!

బిగ్ బాస్ సీజన్-9 లో ఫ్యామిలీ వీక్ సాగుతోంది. ఇందులో భాగంగా భరణి చిన్న కూతూరు హానీ ఎంట్రీ ఇచ్చింది. భరణి రీఎంట్రీ ముందు అతనికి గాయాలు అయ్యాయి.. అప్పుడే భరణి తిరిగి వస్తాడా రాడా అని అందరు అనుకున్నారు. కానీ వచ్చాడు. అక్కడి నుండి తన ఆటస్వరూపమే మారిపోయింది. ఇక ఫ్యామిలీ వీక్ లో తన వాళ్లని చూడాలనుకున్న భరణి కల నెరవేరింది.

ఫ్యామిలీ వీక్‌లో భాగంగా హౌస్‌లోకి భరణి చిన్నకూతురు ఆర్తి అలియాస్ హానీ ఎంట్రీ ఇచ్చింది. చూడటానికి అచ్చం భరణిలానే ఉన్న ఈ అమ్మాయి తన డాడీకి మంచి సలహాలు అయితే ఇచ్చింది. ఆట గురించి హౌస్‌లో ఉన్న మనుషుల గురించి భరణికి మంచి ఇన్‌పుట్స్ ఇచ్చింది. హౌస్‌లో కూతుర్ని చూడగానే భరణి ఎమోషనల్ అయిపోయాడు. ఇక తన డాడీకి తగిలిన దెబ్బల గురించి భరణి కూతురు చాలా టెన్షన్ పడింది. ఇక తనూజని చూడగానే వెళ్లి గట్టిగా హత్తుకొని.. నీది నాన్నది బాండ్ అంటే నాకు చాలా ఇష్టం.. లవ్యూ అంటూ పలకరించింది భరణి కూతురు. మరోవైపు దివ్యకి మాత్రం ఏదో చెప్పాలంటే చెప్పాలన్నట్లు ఒక హాయ్ చెప్పింది. ఆ తర్వాత భరణితో కాసేపు మాట్లాడింది. మీరు చాలా బాగా ఆడుతున్నారు.. అయితే ఈ వీక్ మీరు కెప్టెన్ అవ్వాలి.. మీ హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి అంటూ తన కూతురు చెప్పింది.

ఇంతలో దివ్యని భరణి పిలిపించాడు. దీంతో దివ్యతో కాసేపు మాట్లాడింది హనీ. నాన్నకి బాలేనప్పుడు మీరు చాలా బాగా చూసుకున్నారు.. మీరు ఉన్నారనే కాస్త మాకు టెన్షన్ తగ్గింది.. అయితే కొంచెం ఆ కమాండింగ్ మాత్రం వద్దక్కా ప్లీజ్.. కొంచెం తగ్గించుకోండి అంటూ దివ్యకి చెప్పింది హానీ. అయ్యో రిక్వెస్ట్ వద్దు.. నిజానికి ఆయన ఫ్యామిలీ ఎవరొచ్చినా నన్ను తిడతారని నేను ముందే ఫిక్స్ అయిపోయాను.. ఎందుకంటే ఆయనపై నేను అంత ఫైర్ అయ్యాను.. అలిగానంటూ దివ్య చెప్పింది. కాసేపటి తర్వాత భరణితో మాట్లాడుతూ దివ్య విషయంలో ఇండైరెక్ట్‌గా ఒక సలహా ఇచ్చింది కూతురు. మాకు ఫైర్ భరణి కావాలి.. అగ్రెసివ్ భరణి మాకు కావాలి.. జస్ట్ కొంచెం కమాండ్ చేసేవాళ్లతో జాగ్రత్తగా ఉండాలి.. మీకు వాళ్లు కమాండ్ చేసేది ఏమైనా నచ్చకపోతే చెప్పేయండి సైలెంట్‌గా ఉండొద్దు.. మేము ఆ ఫైర్ భరణిని చూడాలి.. అంటూ దివ్య విషయంలో సలహా ఇచ్చింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.