English | Telugu

Bigg Boss 9 Telugu Family Week Rithu : రీతూ చౌదరికి తల్లి వార్నింగ్... భయపడ్డ డీమాన్ పవన్!

బిగ్ బాస్ సీజన్-9 లో పన్నెండవ వారం ఫ్యామిలీ వీక్ సాగుతోంది. ఇందులో భాగంగా నిన్నటి ఎపిసోడ్ లో రీతూ వాళ్ల అమ్మ ఎంట్రీ ఇచ్చింది.

అమ్మని చూడగానే ఐ మిస్ యూ.. అంటూ రీతూ హగ్ చేసుకుంది. అయితే ఆమె మాత్రం నిన్ను కొట్టాలి.. చాలా ఉంది నీ గురించి చెప్పాల్సింది.. నువ్వు చాలా చేశావంటూ పైకి సరదాగానే అన్నట్లు అనిపించినా ఆమె ఫేస్ మాత్రం సీరియస్‌గానే ఉంది. నేను చెప్పిందేంటి నవ్వు చేసిందేంటి.. అంటూ రీతూని అడుగుతుంటే పక్కనే ఉన్న డీమాన్ కూడా కొంచెం భయపడ్డాడు. ఇదంతా చూసి అమ్మా పదా పక్కకెళ్లి మాట్లాడుదామంటూ రీతూ రిక్వెస్ట్ చేసింది. వద్దమ్మా నాకు ఒక చపాతీ కర్ర ఇవ్వరా.. అంటూ అడుగగా కళ్యాణ్ పరుగెత్తికెళ్ళి చపాతీ కర్ర తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఆ చపాతీ కర్రతో రీతూని కొట్టడానికి వచ్చి.. చివరికి ప్రేమగా హత్తుకుంది. ఆ తర్వాత అందరితో మాట్లాడింది రీతూ వాళ్ల అమ్మ. పైకి డీమాన్ గురించి చెప్పకపోయినా రీతూ తల్లి ఫేసులో, వాయిస్‌లో మాత్రం ఆ విషయంలో సీరియస్‌నెస్ కనిపించింది.

ఇంకా ఐదు వారాలే ఉంది నువ్వు టాప్-5లో ఉండాలి.. కప్పు కొట్టాలి.. గేమ్స్ పైన దృష్టి పెట్టు.. మిగిలినవి వదిలెయ్ అంటూ రీతూకి ఆమె తల్లి సలహా ఇచ్చింది. ఇక తనూజని పిలిపించి మరీ రీతూ వాళ్ళ అమ్మ థాంక్స్ చెప్పింది. అలాగే ఇమ్మాన్యుయల్, సుమన్ శెట్టి, సంజనతో ప్రేమగా మాట్లాడింది. అమ్మా డీమాన్‌తో మాట్లాడు ప్లీజ్ అని రీతూ చెప్పగానే.. హాయ్ డీమాన్.. బాగా ఆడుతున్నావని అంది. మీ అమ్మ కూడా వచ్చినట్లున్నారు కదా.. చాలా బాగుంది.. మా అమ్మాయిని ప్రేమగా పలకరించారు.. థాంక్యూ అని డీమాన్ తో మాట్లాడింది. ఇదంతా చూసి డీమాన్ ఫేస్ డల్ అయిపోయింది. రీతూ తల్లి వెళ్లిపోయాక కూడా డీమాన్ డల్‌గానే కనిపించాడు.

మీ అమ్మ మన గురించి ఏమైనా అడిగిందా అని రీతూని డీమాన్ అడుగగా.. అదేం లేదని రీతూ అంది. అందరి గురించి చెప్పిందంటూ కవర్ చేసింది. చివరికి మీ మదర్ మన గురించి ఏమన్నా అన్నారేమోనని టెన్షన్ పడ్డాను.. నువ్వు ఏమైనా చెప్తే ఇక నీతో రేపటి నుంచి మాట్లాడకూడదనుకున్నానంటూ డీమాన్ అన్నాడు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.