English | Telugu

వంటలక్క కంటే నాగ్‌, తారక్‌కు తక్కువే!

సూపర్‌హిట్ సీరియల్ టీఆర్పీని బీట్ చేసే క్రమంలో... స్టార్ అట్రాక్షన్ లక్ష్యానికి కొంతదూరంలో నిలిచింది. వంటలక్కపై బుల్లితెర వీక్షకులకు ఉన్న అభిమానం ముందు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న గేమ్ షో 'ఎవరు మీలో కోటీశ్వరులు', కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్న రియాలిటీ షో 'బిగ్ బాస్ 5'కు తక్కువ టీఆర్పీలు రావడం గమనార్హం.

జెమినీ టీవీలో వస్తున్న 'ఎవరు మీలో కోటీశ్వరులు' కర్టెన్ రైజర్ ఎపిసోడ్‌కు 11.4 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. దాని త‌ర్వాత‌ ఈ షో హైయ్యస్ట్ రేటింగ్ 11.37. అయితే, టీవీలో ఎన్టీఆర్ బెస్ట్ ఇదేనా? అంటే కాదు అని చెప్పాలి. ఎందుకంటే... ఆయన హోస్ట్ చేసిన 'బిగ్ బాస్ 3'కి 17.9 రేటింగ్ వచ్చింది. దాన్ని 'బిగ్ బాస్ 5'తో నాగార్జున బ్రేక్ చేశారు. 18 టీఆర్పీ రేటింగ్ సాధించారు. అయితే... ఎస్‌డి, హెచ్‌డి మినహాయిస్తే 15.66 మాత్రమే. టీఆర్పీ విషయంలో ఈ రెండు షోస్ కంటే 'కార్తీక దీపం' సీరియల్ ముందంజలో ఉంది.

జూన్ తొలి వారంలో 'కార్తీక దీపం'కు 19.10 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. దాన్ని ఎన్టీఆర్, నాగార్జున ఇద్దరూ బీట్ చెయ్యలేకపోయారు. దీన్నిబట్టి వంటలక్కకు ఎంతమంది అభిమానులు ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.