English | Telugu

ష‌న్నుని విమర్శించిన యూట్యూబ‌ర్‌కి అఖిల్ కౌంట‌ర్‌

బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్‌ల మ‌ధ్య గొడ‌వ‌లేమోగానీ బ‌య‌ట వారి అభిమానుల మ‌ధ్య వైరం మాత్రం ప్ర‌తీ సీజ‌న్‌లోనూ తారా స్థాయికి చేరుకుంటోంది. మ‌రీ ప‌చ్చిగా త‌మ కంటెస్టెంట్‌ల‌కి అడ్డుగా నిలుస్తున్న వారిపై అభిమానులు హ‌ద్దులు దాటి విమ‌ర్శ‌లు చేస్తూ తిట్ల పురాణం అందుకుంటున్నారు. కొంత మందేమో అడుక్కుతినే ఫేస‌ని, పేప‌ర్లు అమ్ముకునే ఫేస్‌లా వుందంటూ కామెంట్‌లు చేస్తున్నారు. ఇలాంటి కామెంట్ల‌నే ఓ యూట్యూబ‌ర్ తాజాగా చేశాడు. అది కూడా ష‌ణ్ముఖ్ జ‌స్వంత్‌ని ఉద్దేశించి చేయ‌డం గ‌మ‌నార్హం. ..అయితే ఈ కామెంట్‌ల‌ని ఖండిస్తూ బిగ్‌బాస్ సీజ‌న్ 4 ర‌న్న‌ర‌ప్ అఖిల్ సార్థ‌క్ రంగంలోకి దిగ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

బిగ్‌బాస్ సీజ‌న్ 5 12వ వారం పూర్తి చేసుకుని 13వ వారంలోకి ఎంట‌రైంది. ఈ నేప‌థ్యంలో యాంక‌ర్ ర‌వి ఎలిమినేట్ కావ‌డం ప‌లువురిని షాక్‌కు గురిచేసింది. ఇక‌ ష‌న్ను కెప్టెన్ కావ‌డంతో నామినేష‌న్స్‌లో మొత్తం 7 మిగిలారు. ఇదిలా వుంటే ష‌న్నుని ఓ యూట్యూబ‌ర్ దారుణంగా కామెంట్ చేశాడు. `ష‌న్నును ఎక్క‌డో చూసిన‌ట్టుగా వుంది. పొద్దున్నే పాల ప్యాకెట్‌లు ఎత్తుకుపోయేది.. కాగితాలు ఏరుకునేది మీరేక‌దా గుర్తుప‌ట్టాను. మీ ముఖం అయితే ఐదు పైస‌లు వుంట‌ది. కాగితాలు ఏరుకునేటోడు ఓ రాయి ప‌ట్టుకుని కుక్క‌ల వెన‌కాల తిరుగుతుంట‌డు చూడు వాడు సేమ్ నీలాగే వుంటాడు ష‌న్ను` అని కామెంట్ చేశాడు.

దీనిపై బిగ్‌బాస్ సీజ‌న్ 4 ర‌న్న‌ర‌ప్ అఖిల్ సార్థ‌క్ ఘాటుగా స్పందించాడు. ఇంత‌కు ముందు మీ మీద గౌర‌వం వుండేది. ఇప్పుడ‌ది పోయింది. మీరు చేస్తోంది చాలా పెద్ద త‌ప్పు. ఒక‌రు మీకు న‌చ్చ‌లేదంటే వాళ్ల‌ని మీరు బాడీ షేమింగ్ చేయాల్సిన అవ‌స‌రం లేదు. మ‌రీ ఇంత‌లా ద్వేషించకండి. ఇది ఒక గేమ్ షో మాత్ర‌మే. చూసి ఎంజాయ్ చేయండంతే. మరీ ఇంత నెగెటివిటీ వ‌ద్దు. నోటికొచ్చిన‌ట్లు మాట్లాడ‌టం చాలా ఈజీ. నువ్వు ఆ గేమ్ షోలో ఉండి వుంటే నిన్ను ఎవ‌రైనా ఇలా ట్రోల్ చేస్తే నీకు తెలుస్తుంది ఆ బాధేంటో. వ‌య‌సు పెర‌డం కాదు బుద్ధి కూడా పెర‌గాలి` అని చుర‌క‌లంటించాడు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.