English | Telugu

Brahmamudi : కావ్య, అప్పుల శ్రీమంతం.. రుద్రాణిని గెంటేసిన దుగ్గిరాల కుటుంబం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -923 లో... కావ్య దగ్గరికి కనకం వచ్చి ఎమోషనల్ గా మాట్లాడుతుంది. అప్పుడే ఇందిరాదేవి వస్తుంది. మీ వల్లే నా కూతురు ఈ రోజు ఇంత సంతోషంగా ఉందని ఇందిరాదేవితో కనకం అంటుంది. అదంతా దూరం నుండి రేఖ, రుద్రాణి చూస్తూ వీళ్ళందరు.. ఇక్కడే ఉన్నారు. ఈ మందు ఇప్పుడు కలపలేమని రేఖతో రుద్రాణి అంటుంది. అప్పు, కావ్య శ్రీమంతానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తారు. ఇద్దరు శ్రీమంతం కుర్చీలో కూర్చుంటారు.

ముందుగా పుట్టింటి సారె పెట్టాలని కనకం అంటుంది. అలా కాదమ్మా ముందు తమ భర్తలు ఒడి నింపాలని పంతులు చెప్తాడు. దాంతో రాజ్, కళ్యాణ్ ఇద్దరు వెళ్లి అప్పు, కావ్యలని ఆశీరదిస్తారు. మరొకవైపు అందరు శ్రీమంతం హడావిడిలో ఉంటే కావ్య గదిలోకి రుద్రాణి వెళ్లి అక్కడ తను తాగే కశాయంలో పసరు మందు కలపబోతుంటే అప్పుడే కనకం వచ్చి ఆపుతుంది. ఏం చేస్తున్నావని కనకం అనగానే.. కావ్య ఇది మర్చిపోయింది అందుకేనని భయపడుతుంది. కనకం కోపంగా మాట్లాడేసరికి కనకాన్నే దబాయిస్తుంది రుద్రాణి.

ఆ తర్వాత అందరు అప్పు, కావ్యలని ఆశీర్వదిస్తారు. అమ్మ ఎక్కడ అని కావ్య, అప్పు అనుకుంటారు. రుద్రాణి ఇద్దరిని ఆశీర్వదిస్తుంటే వద్దని కనకం అంటుంది. రుద్రాణికి పసరు మందు ఇచ్చిన అతన్ని తీసుకొని కనకం ఎంట్రీ ఇస్తుంది. దాంతో రుద్రాణి షాక్ అవుతుంది. ఈ రుద్రాణి, కావ్య కడుపులో బిడ్డని చంపాలని అనుకుంది. కశాయంలో పసరు మందు కలపబోతుంటే నేను ఆపాను.. పైగా నన్నే దబాయించింది డౌట్ వచ్చి వీడిని పట్టుకొని తీసుకొని వచ్చాను. ఆ పసరు మందు ఇచ్చింది వీడేనని కనకం అన్ని చెప్పేస్తుంది. అందరు షాక్ అవుతారు. ఇంకా తప్పుని కప్పిపుచ్చుకోవాలని రుద్రాణి ట్రై చేస్తుంటే.. ఇంత సాక్ష్యం కన్పిస్తుంది నువ్వు తప్పించుకోలేవని కనకం అంటుంది. తరువాయి భాగంలో రుద్రాణిని ఇంట్లో నుండి గెంటేస్తారు. రాహుల్, రేఖ ఇద్దరికి దుగ్గిరాల కుటుంబం నాశనం చెయ్యమని చెప్తుంది. మరొకవైపు నేను డెలివరీ అయ్యే టైమ్ కి మీరు నాతో పక్కన ఉండాలని రాజ్ దగ్గర కావ్య మాట తీసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.