English | Telugu

Podharillu : భూషణ్ నిజం చెప్పడంతో ప్రతాప్ ఫ్యామిలీ షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -22 లో....భూషణ్ ని పెళ్లి చేసుకోవడం మహాకి ఇష్టం లేదు. దాంతో చక్రి సహాయంతో ఇంట్లో నుండి వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకుంటుంది మహా. బ్యాగ్ లో బట్టలన్నీ సర్దుకుంటుంది. అప్పుడే హారిక కాఫీ తీసుకొని వస్తుంది. మావయ్య కొట్టాడని భాదపడుతున్నావ్ కానీ అయన అనుభవంతో భూషణ్ ని సెలెక్ట్ చేసి ఉండొచ్చు కదా అని హారిక అంటుంది. దాంతో కాఫీలో షుగర్ ఎక్కువ అయిందని కాఫీ తనకి ఇస్తుంది మహా.

హారిక వెళ్ళిపోతూ.. ఏంటి ఎప్పుడు లేనిది డోర్ పెట్టుకున్నావు.. డోర్ ఓపెన్ చేసే ఉంచమని హారిక చెప్పి తన గదిలోకి వెళ్తుంది. ఆ తర్వాత చక్రి దగ్గరికి మహా వెళ్లి ముందు తన బ్యాగ్ ఇస్తుంది. సిటీ నుండి కార్ వస్తుంది. మీరు రెడీగా ఉండండి అని మహాకి చెప్తాడు చక్రి. అ తర్వాత మహా ఇంట్లోకి వెళ్తుంది. కాసేపటికి ప్రతాప్ వాళ్ళు గుడి నుండి ఇంటికి వస్తారు. మహాని పిలిచి మాట్లాడతారు. మహాతో ఆది కోపంగా మాట్లాడుతుంటే.. ఎందుకురా ఎప్పుడు దానిపై కోప్పడతావా.. ఈ ఒక్క రోజే మనతో ఉండేదని మహా వాళ్ల అమ్మ అంటుంది. ప్రతాప్ ఎమోషనల్ అవుతు.. సారీ మహా అని చెప్తాడు. ఆమ్మో ఇప్పుడు కరిగిపోతే నా లైఫ్ వాడి చేతిలోకి వెళ్తుందని పర్లేదు నాన్న అని లోపలికి వెళ్తుంది మహా.

హమ్మయ్య నాకు రిలీఫ్ గా ఉందని ప్రతాప్ అంటాడు. అందరు పడుకున్నాక మహా లెటర్ రాస్తుంది. వాళ్ల నాన్న దగ్గరికి వెళ్లి ఎమోషనల్ అవుతుంది. ఇంట్లో నుండి బయటకు వచ్చేస్తుంది. తరువాయి భాగంలో చక్రితో మహా వెళ్ళిపోతుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. మహా తనకి నచ్చినట్టు ఇష్టం వచ్చినట్లు భూషణ్ ని తిడుతుంది. నువ్వు ఎక్కడున్నావ్ మహా.. అ సౌండ్ ఏంటని భూషణ్ అడుగుతాడు. వెంటనే ఆదికి భూషణ్ ఫోన్ చేసి.. ఇంట్లో మీ చెల్లి లేదని చెప్తాడు. మహా రాసిన లెటర్ ఇంట్లో వాళ్ళు చదివి షాక్ అవుతారు. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.