English | Telugu

ముమైత్ ఫ్యూచర్ బ్యూటిషియన్స్  అకాడమీ త్వరలో



ముమైత్ ఖాన్ అంటే చాలు ఐటమ్ సాంగ్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గానే ఎవరికైనా గుర్తొస్తుంది. బిగ్ బాస్ సీజన్ 1 కంటెస్టెంట్‌గా అల్లాడించింది ముమైత్ ఖాన్.. అమ్మ తమిళనాడు.. నాన్న పాకిస్థాన్ .. దాంతో ముమైత్ మిక్స్డ్ బ్రీడ్ బేబీగా మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ లో చేసి ఆడియన్స్ లో తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ ని క్రియేట్ చేసుకుంది. అలాంటి ముమైత్ చాలా ఏళ్లుగా బయట ఎక్కడా కనిపించడంలేదు. షోస్ లో మూవీస్ లో కూడా కనిపించడం లేదు. జీ తెలుగులో ‘డాన్స్ ప్లస్’ జడ్జీగా చేసాక ఆమె ఎవరికీ కనిపించలేదు. ఐతే ఇప్పుడు రీసెంట్ గా ముమైతే తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక పోస్ట్ ని పెట్టింది. త్వరలో ఒక అకాడమీని స్టార్ట్ చేయబోతోంది.

అదే "వెల్కి అకాడెమి" అంటే ఫ్యూచర్ బ్యూటిషియన్స్ ని తయారు చేసే అకాడెమి అన్నమాట. బ్యూటీ మాస్టర్ కోర్స్ లో ట్రైనింగ్ ఇప్పించేలా ముమైత్ తన అకాడెమిని సిద్ధం చేస్తోంది. మరి తన అకాడమీ స్టార్ట్ చేయబోతున్న సందర్భంగా అందరూ ఆమెకు విషెస్ చెప్పారు. ఇక ముమైత్ 13 ఏళ్ల నుంచే బ్యాగ్రౌండ్ డాన్సర్‌గా పని చేయడం స్టార్ట్ చేసింది. 17 ఏళ్ల వయసులో మున్నాభాయ్ సినిమాలో కూడా నటించింది. తర్వాత పోకిరి మూవీలో ‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే’ సాంగ్‌ చేసింది. ఈ సాంగ్ ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.