English | Telugu

బాబా భాస్క‌ర్ ఎంట్రీ.. నువ్వు బిగ్ బాసా..? అరియానా ఫైర్‌

బిగ్‌బాస్ నాన్ స్టాప్ హౌస్ లోకి బాబా భాస్క‌ర్ మాసీవ్ ఎంట్రీ ఇచ్చేశాడు. వ‌చ్చీ రాగానే కంటెస్టెంట్ ల‌ని స‌ర్ ప్రైజ్ పెరుతో టెన్ష‌న్ పెట్టాడు. గెస్ట్ లా వ‌చ్చాడ‌ని భావించిన ఇంటి స‌భ్యుల‌కు తాను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చానంటూ దిమ్మ‌దిరిగే షాకిచ్చాడు. ఎంట్రీ ఇస్తూనే గేటు దూకి మ‌రీ ర‌చ్చ ర‌చ్చ చేశాడు. ఇదేంటీ ఇలా వ‌చ్చాడ‌ని అంతా షాక్ కు గురైపోయారు. ఇత‌నేంటీ ఇలా ఎంట్రీ ఇచ్చాడ‌ని అంతా విస్తూ పోయారు. అయితే వారిని ఆట ఆడుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న బాబా భాస్క‌ర్ త‌న‌కు బిగ్ బాస్ సూప‌ర్ ప‌వర్ ఇచ్చాడ‌ని, వీర లెవెల్లో బిల్డ‌ప్ ఇచ్చేశాడు.

అప్ప‌టి వ‌ర‌కు వెలిగిపోయిన ఇంటి స‌భ్యులు ముఖాలు ఒక్క‌సారిగా మాడిపోయాయి. ఏం జ‌రుగుతోంది? .. బాబా భాస్క‌ర్ ఎందుకు ఎంట్రీ ఇచ్చాడు? ... ఏంటీ అత‌ని గొప్ప అనే విధంగా అరియానా ఫీలైపోయింది. 'నామినేష‌న్స్ లో వున్న ఆరుగురు రండి' అంటూ ఏదో చేయ‌బోతున్న‌ట్టుగా బిల్డ‌ప్ ఇచ్చాడు బాబా భాస్క‌ర్. 'ఏకాభిప్రాయం తీసుకుని చెప్పండి' అని అన‌గానే అరియానా అందుకుసిద్ధ‌మైంది. ఇంత‌లో టైమ్ వేస్ట‌వుతోంద‌ని మ‌రీ రెచ్చిపోయాడు బాబా భాస్క‌ర్‌. 'మీరు అలా అంటే ఏమీ చేయ‌లేము' అని అరియానా అస‌హ‌నాన్ని ప్ర‌ద‌ర్శించింది.

'అయినా మీరెవ‌రు అడ‌గ‌డానికి?.. మీకు ఎందుకు చెప్పాలి?.. అలా అని బిగ్ బాస్ వాయిస్ వినిపించ‌మ‌ని చెప్పండి' అని గ‌ట్టిగానే నిల‌దీసింది అరియానా.. 'ఈయ‌న బిగ్ బాస్ రా చెప్ప‌డానికి.. గెస్ట్ గా వ‌స్తే ఏది చెప్ప‌మంటే అది చెప్పాలా?' అంటూ చిందులేసింది. వెంటనే 'స‌ర్‌ప్రైజ్‌ అని చెబుతున్నాను క‌దా?' అన్నాడు బాబా భాస్క‌ర్‌. ఇదంతా సీరియ‌స్ ట‌ర్న్ తీసుకుంటోంద‌ని గ‌మ‌నించిన బాబా భాస్క‌ర్ త‌నేంటో చెప్పేశాడు. త‌న వైల్డ్ కార్డ్ ఎంట్రీ తో హౌస్ లోకి పంపించార‌ని చెప్పేశాడు. 'రెండు రోజుల్లో మీతో క‌లిసి పోతాను `అంటూ షాకిచ్చాడు. దీంతో హౌస్ లో వున్న వాళ్ల లెక్క‌ల‌న్నీ ఒక్క‌సారిగా మారిపోయాయి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.