English | Telugu

అషురెడ్డి చెంపదెబ్బ.. ఆర్జీవీ రియాక్షన్ సూప‌రంట‌!

‘దూకుడు’ సినిమాలో మహేశ్‌బాబు, బ్రహ్మానందం మధ్య సన్నివేశాలు గుర్తున్నాయా? "చెంప‌దెబ్బ‌ల‌కు మీరిచ్చిన రియాక్షన్స్‌ బావున్నాయి" అని మహేశ్‌బాబు చెప్పడంతో ప్రైజ్‌ మనీ కోసం మళ్లీ మళ్లీ కొట్టించుకోవాలని బ్రహ్మానందం ప్రయత్నిస్తారు. అషురెడ్డి చెంపదెబ్బకు రామ్‌ గోపాల్‌ వర్మ ఇచ్చిన రియాక్షన్‌ బ్రహ్మీని మించిపోయిందని నెటిజన్స్‌ అంటున్నారు.

బ్యూటిఫుల్‌ గాళ్‌, ‘బిగ్‌బాస్‌’ ఫేమ్‌ అషురెడ్డితో కాంట్రవర్షియల్‌ కింగ్‌ ఆర్జీవీ బోల్డ్‌ ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే. లేటెస్ట్‌గా ప్రోమో రిలీజ్‌ చేశారు. అందులో ఆర్జీవీ ఎవరో తనకు తెలియనట్టు అషురెడ్డి బిహేవ్‌ చేశారు. అదంతా యాక్టింగ్‌ అని తెలుస్తోంది. అంతకు మించిన విషయం ఏంటంటే... ఆర్జీవీని అషురెడ్డి చాచిపెట్టి చెంప‌పై కొట్టడం! ఇంటర్వ్యూ మీద జనాల్లో ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేయడానికి ఇటువంటి జిమ్మిక్కులు చేయడంలో వర్మ దిట్ట. అయితే, ఇంటర్వ్యూలో అషురెడ్డి కాళ్ల మీద వర్మ ఎక్కువ ఫోకస్‌ చేశారు. దానికంటే ఆమె చెంపదెబ్బకు ఆర్జీవి ఇచ్చిన రియాక్షన్‌ హైలైట్‌ అయ్యింది.

"ఆర్జీవిగారి చెంపదెబ్బ రియాక్షన్‌ బ్రహ్మానందంగారిని మించిపోయింది" అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశారు. "ఆర్జీవీని కొట్టిన మొదటి పిల్ల... పైనా కిందా ఊపు. ఆర్జీవీ సార్‌ తోపు" అని ఇంకో కామెంట్‌. "ఆర్జీవీ అంటే కొట్టడం మాత్రమే అనుకున్నా. కొట్టించుకోవడం కూడానా... ఓన్లీ సింగిల్‌ మీనింగ్‌" అని ఒకరు కామెంట్‌ చేశారు. "ఇండియాలో స్వతంత్య్రం వచ్చింది అంటే అది ఆర్జీవీ సార్‌కి మాత్రమే" అని ఎవరో కామెంట్‌ పెట్టారు. మొత్తం మీద ఇంటర్వ్యూ ప్రోమో యూట్యూబ్‌లో వైరల్‌ అవుతోంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.