English | Telugu

పెళ్లికి ముందు పిల్లలు పుట్టరని డాక్ట‌ర్లు చెప్పారు.. రోజా భావోద్వేగం!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విజయవంతమైన హీరోయిన్లలో రోజా ఒకరు. కథానాయికగా వెండితెరపై ఓ వెలుగు వెలిగిన రోజా, ప్రస్తుతం 'జబర్దస్త్'తో సహా ఇతర కార్యక్రమాల ద్వారా బుల్లితెర ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. రోజా దగ్గర బోలెడు డబ్బులు ఉన్నాయని చాలామంది అనుకుంటారు. ఇప్పుడు రోజా దగ్గర డబ్బులు ఉండి ఉండవచ్చు. అయితే కథానాయికగా కెరీర్ ప్రారంభించినప్పటి నుండి పదేళ్ల పాటు కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ అప్పులు కట్టడానికి సరిపోయాయని తాజాగా బయటపెట్టారు.

"నేను 1991లో ఇండస్ట్రీకి వచ్చాను. 2002 వరకూ కష్టపడినది మొత్తం అప్పులు కట్టాను" అని వినాయక చవితి సందర్భంగా త్వరలో ఈటీవీలో ప్రసారం కానున్న 'ఊరిలో వినాయకుడు' స్పెషల్ ఈవెంట్ లో చెప్పారు. ఈ సంగతి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమె చెబుతుంటే ఇంద్రజ, పూర్ణ ఎమోషనల్ అయ్యారు. ఇద్ద‌రూ రోజా దగ్గరకు వెళ్లి ఓదార్చారు.

పెళ్లి చేసుకునే ముందు తనకు పిల్లలు పుట్టరని వైద్యులు చెప్పారని... అయితే, ఏడాదిలో ప్రెగ్నెన్సీ వచ్చి అన్షు పుట్టిందని రోజా తెలిపారు. అందుకే, తనకు కుమార్తె అన్షు అంటే చాలా చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు. 'ఊరిలో వినాయకుడు' కార్యక్రమానికి రోజా కుమార్తె, కుమారుడు వచ్చారు. అలాగే, హీరో శ్రీకాంత్ కూడా సందడి చేశారు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.