English | Telugu

 మాన్సీ త‌ల్లికి చుక్క‌లు చూపించిన అను

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న థ్రిల్ల‌ర్ ఎంట‌ర్ టైన‌ర్ `ప్రేమ ఎంత మ‌ధురం`. వెంక‌ట్ శ్రీ‌రామ్‌, వ‌ర్ష జంట‌గా న‌టిస్తున్నారు. జ‌య‌ల‌లిత‌, బెంగ‌ళూరు ప‌ద్మ‌, విశ్వ‌మోహ‌న్‌, రామ్ జ‌గ‌న్‌, అనూషా సంతోష్‌, జ్యోతిరెడ్డి త‌దిత‌రులు ఇత‌న ప్ర‌ధాన పాత్ర‌లు చేస్తున్నారు. మరాఠీ సీరియ‌ల్ `తుల ఫ‌ఠేరే` ఆధారంగా ఈ సీరియ‌ల్ ని తెలుగులో రీమేక్ చేశారు. గ‌త కొన్ని వారాలుగా విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతోంది. థ్రిల్లింగ్ అంశాల‌తో ఉత్కంఠ‌భ‌రితంగా సాగుతున్న ఈ సీరియ‌ల్ శ‌నివారం ఆస‌క్తిక‌ర మ‌లుపుల‌తో స‌రికొత్త ట్విస్ట్ ఇవ్వ‌బోతోంది.

మాన్సీని ఇంట్లోంచి గెంటేసే క్ర‌మంలో ఇంటికి చేరుకున్న మాన్సీ త‌ల్లిని త‌మ ఇంట్లోనే న‌చ్చిన‌న్ని రోజులు వుండ‌మంటాడు ఆర్య‌. దీన్ని అడ్వాంటేజీగా తీసుకున్న మాన్సీ త‌ల్లి అనుని అవ‌మానించ‌డం మొద‌లుపెడుతుంది. ఇంటి నుంచి ఏమీ తీసుకురాలేదంట‌గా అంటూ అనుని ఆర్య‌ ముందే అవ‌మానించే ప్ర‌య‌త్నం చేస్తుంది. పుల్లవిరుపు మాట‌ల‌తో అనుని ప‌దే ప‌దే అవ‌మానించ‌డం మొద‌లుపెడుతుంది. ఇది గ‌మ‌నించిన ఆర్యవ‌ర్థ‌న్ మీ కంటే ఎక్కువ క‌ట్న‌కానుక‌ల్ని అను తీసుకొచ్చింద‌ని చెబుతాడు.

మీ ద‌గ్గ‌ర లేనిది అను ఫ్యామిలీ ద‌గ్గ‌ర వుంద‌ని చెప్పి క్లాసు పీకుతాడు. దీంతో విష‌యం సీరియ‌స్ అవుతోంద‌ని గ‌మ‌నించిన మాన్సీ.. 'తెగేవ‌ర‌కు లాగ‌కు చెడుతుంది' అని త‌ల్లిని కంట్రోల్ చేస్తుంది. అవ‌మానం భ‌రించ‌లేక త‌ల్లీ కూతుళ్లు ఎవ‌రూ లేనిది గ‌మ‌నించి మందుకొడుతుంటాడు. ఇదే స‌మ‌యంలో అను మెట్లు దిగుతూ వుంటుంది. అది గ‌మ‌నించిన మాన్సీ ఇప్ప‌డు త‌న‌ని క‌దిలించ‌కు, క‌దిలిస్తే చెడామ‌డ వాయిస్తుంద‌ని, ఒక రోజు త‌న‌ని ఇలాగే కొట్టింద‌ని చెబుతుంది. దీంతో ఆగ్ర‌హానికి లోనైన మాన్సీ త‌ల్లి అనుని అడ్డ‌గించి 'నా కూతురినే కొడ‌తావా?' అంటూ అనుపై చేయి చేసుకోబోతుంది.

మాన్సి ఎంత వ‌ద్ద‌ని వారించినా ఆమె త‌ల్లి విన‌కుండా అను పైకి వెళుతుంది. దీంతో అను మాన్సీ త‌ల్లి చెంప‌లు వాయించి చుక్క‌లు చూపిస్తుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది?.. అను ఎటు వెళ్లింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.