English | Telugu

అభిమ‌న్యు, మాళ‌విక ఉచ్చులో య‌ష్‌, వేద‌

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్ ప్ర‌ధాన జంట‌గా న‌టిస్తున్నారు. గ‌త కొన్ని వారాలుగా విజ‌య‌వంతంగా ప్ర‌సారం అవుతోంది. ఓ పాప నేప‌థ్యంలో ఆస‌క్తిక‌ర మ‌లుపుల‌తో ఈ సీరియ‌ల్ ని ద‌ర్శ‌కుడు ముందుకు న‌డిపిస్తున్నాడు. ఈ శ‌నివారం ఏం జ‌ర‌గ‌బోతోంది?.. పార్టీలో క‌లిసిన య‌ష్ ని ప‌క్క‌దారి ప‌ట్టించ‌డానికి అభిమ‌న్యు ప‌న్నిన కుట్ర ఏంటీ? ..ఇందుకు మాళ‌విక కూడా వేద‌ని ఎలా మ‌రోసారి బుట్ట‌లో వేసే ప్ర‌య‌త్నం చేసింది అన్న‌ది ఒక‌సారి చూద్దాం.

ఫ్రెండ్ త‌న 10వ మ్యారేజ్‌ యూనివ‌ర్స‌రీ అని పార్టీ ఇస్తాన‌ని య‌ష్‌ని పార్టీకి పిలుస్తాడు. అయిష్టంగానే భార్య వేద‌తో క‌లిసి య‌ష్ పార్టీకి వ‌స్తాడు. అయితే అది గ‌తంలో త‌న‌ని వేధించిన ప్లేస్ కావ‌డంతో వెంట‌నే తిరిగి వెళ్లిపోవాల‌నుకుంటాడు. అయితే అత‌ని ఫ్రెండ్ అదేమీ కుద‌ర‌ద‌ని చెప్పి య‌ష్ ని బ‌ల‌వంతంగా పార్టీలోకి తీసుకెళ‌తాడు. ఈ క్ర‌మంలో వేద‌ని అక్క‌డే వ‌ద‌లేసి య‌ష్ ఫ్రెండ్స్ తో క‌లిసి మందు పార్టీలో జాయిన్ అవుతాడు. ఇది గ‌మ‌నించిన అభిమ‌న్యు .. వెంట‌నే మాళ‌విక‌ని రంగంలోకి దింపేసి వేద‌ని ట్రాప్ చేయ‌మ‌ని చెబుతాడు.

త‌ను వెళ్లి య‌ష్ ని ఉచ్చులోకి దింపే ప్ర‌య‌త్నం మొద‌లుపెడ‌తాడు. త‌న‌తో ప్ర‌త్యేకంగా మాట్లాడాల‌ని చెప్పి య‌ష్ ని ప‌క్క‌కు తీసుకెళ్లిన అభిమ‌న్యు త‌న నాట‌కాన్ని మొద‌లు పెడ‌తాడు. త‌న ద‌గ్గ‌రి నుంచి విలువైన దాన్ని లాక్కున్నావంటాడు. ఏంట‌ని య‌ష్ అడిగితే... ఖుషీ అని చెబుతాడు. త‌ను నా ర‌క్తం పంచుకు పుట్టిన పాప అని త‌న‌ని నా నుంచి వేరు చేశావ‌ని కొత్త నాట‌కం మొద‌లుపెడ‌తాడు. ఇదే స‌మ‌యంలో మాళ‌విక‌.. వేద‌ని ట్రాప్ లో ప‌డేసే ప్ర‌య‌త్నాలు చేస్తుంటుంది. ఇద్దూ అనుకున్న‌ట్టుగానే అభిమ‌న్యు, మాళ‌విక ఉచ్చులో య‌ష్‌, వేద ప‌డ్డారా? ఏం జ‌ర‌గ‌బోతోంది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే .

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.

Podharillu : పోలీస్ స్టేషన్లో చక్రి, మహా.. భూషణ్ ఏం చేయనున్నాడు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -26 లో..... చక్రి, మహా ఇద్దరు కార్లో వెళ్తుంటే వాళ్ళని ఫాలో చేస్తూ మహా వాళ్ళ నాన్న ప్రతాప్ అతడి కొడుకు ఆది వెళ్తారు. వారితో పాటుగా మహాని పెళ్ళి చేసుకోవాలనుకునే భూషణ్ మరోచైపు ఫాలో చేస్తుంటారు. అయితే ఒక దగ్గర చక్రి , మహా వాళ్ళు దొరికిపోతారు. ఇక మహా వాళ్ళ నాన్న ప్రతాప్.. మహాని రమ్మని చెప్పగా.. ఆ జుట్టోడితో నా పెళ్ళి వద్దు అందుకే పారిపోతున్నానని మహా అంటుంది. చక్రిని చంపేసి నా కూతురిని తీసుకురమ్మని ప్రతాప్ అంటాడు. అప్పుడే వారి మధ్యలోకి బాలు కారులో వేగంగా వచ్చి ఆగుతాడు.