English | Telugu

చేసింది ఒకే సీన్‌.. దాన్నీ లేపేశారు.. పాపం శ్రీ‌ప్రియ‌!

బుల్లితెర సీరియళ్ల ద్వారా తనకంటూ తెలుగు ప్రజల్లో మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్న మన తెలుగు అమ్మాయిలలో శ్రీప్రియ ఒకరు. ఆమె ఫస్ట్ టార్గెట్ సీరియళ్లు కాదు, సినిమాలు. సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించింది. సినిమాల్లోకి వస్తానని దర్శకుడు బోయపాటి శ్రీనును కలిసి చెప్పింది. ఆయన వద్దని సలహా ఇచ్చారట. పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించేసరికి 'సరే... ప్రత్నించు' అని చెప్పారట.

ప్రస్తుతం 'జీ తెలుగు'లో ప్రసారమయ్యే 'నిన్నే పెళ్లాడతా' సీరియల్‌లో మానసి పాత్రలో శ్రీప్రియ నటిస్తోంది. అంతకు ముందు 'అగ్నిసాక్షి' సీరియల్ కూడా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే, శ్రీప్రియ ఫస్ట్ టైమ్ కెమెరా ఫేస్ చేసింది దేనికోసమో తెలుసా? 'సుకుమారుడు' సినిమా సెట్స్ లో. ఆది సాయికుమార్ హీరోగా నటించిన 'సుకుమారుడు' సినిమాలో శ్రీప్రియ నటించింది. నటించింది అనడం కంటే తళుక్కున మెరిసింది అనడం బావుంటుంది ఏమో. ఎందుకంటే... అందులో ఒకే ఒక్క సన్నివేశంలో శ్రీప్రియ నటించింది. ఆ ఒక్క సీన్‌నూ ఎడిటింగ్ లో లేపేశారు. ఒక్క చోట తళుక్కున కనిపించింది.

సాయికుమార్ హోస్ట్ చేస్తున్న 'వావ్' షోకి వచ్చిన శ్రీప్రియ ఈ సంగతి చెప్పింది. 'సుకుమారుడు'లో హీరో ఆది, సాయికుమార్ తనయుడు కదా! అందుకని, ఆయనతో ఈ విషయం షేర్ చేసుకుంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.